సెన్సార్ పూర్తిచేసుకున్న బుర్రకథ

Thursday,July 04,2019 - 12:33 by Z_CLU

ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది బుర్రకథ. ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుంది. సెన్సార్ అఫీషియల్స్ ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చారు. సినిమా రన్ టైమ్ 2 గంటల 6 నిమిషాలు ఉంది.

ఇప్పుడొస్తున్న సినిమాలతో పోల్చుకుంటే బుర్రకథ రన్ టైం కాస్త తక్కువే. కానీ కథను సూటిగా సుత్తిలేకుండా చెప్పడం కోసమే రన్ టైమ్ తగ్గించామంటున్నారు మేకర్స్. కావాలంటే ఓ సాంగ్, 2 సీన్లు యాడ్ చేసుకోవచ్చని.. అలాంటి ఎక్స్ ట్రా స్టఫ్ లేకుండా 2 గంటల పాటు హాయిగా నవ్వుకునేలా సినిమాను తీశామని చెబుతున్నారు.

మిస్తీ చక్రవర్తి, నైరా షా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో డైమండ్ రత్నబాబు దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన బుర్రకథ సినిమా, ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతోంది.