ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో కాజల్ సినిమా

Sunday,August 11,2019 - 11:02 by Z_CLU

‘అ!’, ‘కల్కి’ సినిమాల దర్శకుడు ప్రశాంత్ వర్మ తన నెక్స్ట్ సినిమాను కాజల్ తో చేయబోతున్నాడట. ప్రస్తుతం కాజల్ కోసం కథను రెడీ చేసే పనిలో ఉన్నాడని తెలుస్తుంది. లేటెస్ట్ గా కాజల్ కూడా ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ తో సినిమా గురించి చెప్పింది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మతో డిస్కర్షన్స్ జరుగుతున్నాయని, ప్రస్తుతం తను స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడని తెలిపింది.

లేడీ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో కాజల్ ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించనుందట. సో మొదటి సినిమా హీరోయిన్ తోనే  మళ్ళీ ప్రశాంత్ వర్మ సినిమా చేయబోతున్నాడన్నమాట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాతో కాజల్ నిర్మాతగా కూడా మారే అవకాశం ఉంది. తాజా ఇంటర్వ్యూలో దీనిపై కూడా రెస్పాండ్ అయింది ఈ హీరోయిన్.

“నిర్మాణ రంగంలోకి వెళ్లాలనేది ఓ ఆలోచన మాత్రమే. ప్రస్తుతానికైతే ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించబోతున్నాననే విషయం కూడా అవాస్తవం. ప్రస్తుతానికి నిర్మాతగా మారలేను. నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. అయితే ప్రశాంత్ వర్మతో స్టోరీ డిస్కషన్స్ మాత్రం జరుగుతున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.”

సో.. కాజల్ మైండ్ లో అయితే నిర్మాతగా మారాలనే ఆలోచన ఉంది. కానీ ప్రస్తుతానికి యాక్టింగ్ కెరీర్ పైనే ఫోకస్ పెట్టింది.