బోయపాటి సినిమా ఫస్ట్ లుక్ అదిరింది

Friday,June 30,2017 - 11:06 by Z_CLU

మొన్నటికి మొన్న క్యాచీ టైటిల్ తో ఎట్రాక్ట్ చేశాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ఆ టైటిల్ ఇంకా ట్రెండింగ్ లో కొనసాగుతుండగానే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి తన సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేశాడు. బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న జయ జానకి జాయక సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది.

ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ బోయపాటి మార్క్ లో కాకుండా కూల్ గా ఉంది. వర్షం పడుతున్న చల్లటి వెదర్ లో రోడ్డుపై హీరో కూర్చుంటే, బైక్ పక్కన నిల్చుకున్న హీరోయిన్ స్టిల్ తో ఫస్ట్ లుక్ రిలీజైంది. టైటిల్ కు మరింత జస్టిఫికేషన్ ఇచ్చేలా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

భారీ తారాగణంతో తెరకెక్కుతున్న జయజానకి నాయక సినిమాను ఆగస్ట్ 11న విడుదల చేయాలని నిర్ణయించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.