జాను ట్రయిలర్: సేమ్ కెమిస్ట్రీ.. సేమ్ ఫీల్

Wednesday,January 29,2020 - 07:58 by Z_CLU

శర్వానంద్-సమంత హీరోహీరోయిన్లుగా నటించిన జాను సినిమా ట్రయిలర్ కొద్దిసేపటి కిందట విడుదలైంది. తమిళ్ లో కల్ట్ లవ్ స్టోరీగా పేరుతెచ్చుకున్న 96 సినిమాకు రీమేక్ ఇది. ట్రయిలర్ చూస్తే.. నిజాయితీగా రీమేక్ ను తెరకెక్కించినట్టు అర్థమౌతోంది. ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న ఫ్రేమ్స్, సీన్స్.. యాజ్ ఇటీజ్ గా జానులో కూడా వాడారు.  సేమ్ టైమ్ ఆ ఫీల్ అండ్ ఎమోషన్ కూడా పండడం జానుకు ప్లస్ అయింది

అవును.. జాను ట్రయిలర్ చాలా బాగుంది. రాము-జాను పాత్రల్లో శర్వానంద్-సమంత ఒదిగిపోయారనే విషయం ట్రయిలర్ చూస్తేనే అర్థమౌతోంది. ఇద్దరూ మంచి పెర్ఫార్మర్స్ కావడంతో ట్రయిలర్ బాగా పండింది. ఈ ఒక్క ట్రయిలర్ తో జానుపై అంచనాలు పెరిగిపోయాయి.

ఒరిజినల్ వెర్షన్ ను డైరక్ట్ చేసిన ప్రేమ్ కుమార్, ఈ జానుకు కూడా దర్శకత్వం వహించడంతో ఎమోషన్ కూడా క్యారీ అయింది. గోవింద్ వసంత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మహేంద్రన్ జయరాజు సినిమాటోగ్రఫీ ట్రయిలర్ ను టెక్నికల్ గా కూడా నిలబెట్టాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లలోకి రానుంది.