ఇస్మార్ట్ గా దంచికొట్టాడు

Thursday,October 24,2019 - 03:16 by Z_CLU

రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా థియేటర్లలో డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా స్మాల్ స్క్రీన్ పై కూడా సంచలనం సృష్టించింది. తాజాగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగు ఛానెల్ లో ప్రసారమైన ఈ సినిమాకు అదిరిపోయే రేటింగ్ వచ్చింది. ఈ సినిమాకు ఏకంగా 16.63 (అర్బన్) టీవీఆర్ రావడం విశేషం.

పక్కా మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కింది ఇస్మార్ట్ శంకర్. అద్భుతమైన కథ, ఆకట్టుకునే స్క్రీన్ ప్లే, ఫైనల్లో సూపర్బ్ ట్విస్ట్.. అన్నింటికీ మించి రామ్ మాస్ విశ్వరూపం. ఇలా అన్ని ఎలిమెంట్స్ కలిసి ఇస్మార్ట్ శంకర్ ను బ్లాక్ బస్టర్ చేశాయి. పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మాతలుగా వ్యవహరించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ సరసన నటా నభాష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. మణిశర్మ కంపోజ్ చేసిన పాటలన్నీ సూపర్ డూపర్ హిట్టయ్యాయి. అందుకే బుల్లితెర ప్రేక్షకుల్ని కూడా ఇది ఎంతగానో అలరించింది.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా అక్టోబర్ 13న జీ తెలుగు, జీ తెలుగు హెచ్ డీ ఛానెల్స్ లో ప్రసారమైన ఈ సినిమాకు ప్రేక్షక దేవుళ్లు బ్రహ్మరథం పట్టారు. కంటెంట్ కనెక్ట్ అయితే మాస్-క్లాస్ అనే తేడా లేదని మరోసారి నిరూపించారు. ఫెస్టివ్ సీజన్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు అసలైన పండగ తీసుకురావడంతో పాటు.. వాళ్లకు ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైన్ మెంట్ అందించింది.

గతంలో జీ తెలుగు ఛానెల్ లో ప్రసారమైన డీజే, శ్రీమంతుడు, శతమానంభవతి, నేను లోకల్, గీతగోవిందం, కాంచన 3 లాంటి ఎన్నో సినిమాలు రికార్డు బ్రేకింగ్ టీఆర్పీలతో సంచలనం సృష్టించాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి ఇస్మార్ట్ శంకర్ కూడా చేరింది. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకుల్ని అలరించబోతోంది మీ జీ తెలుగు.