Interview - మేఘ ఆకాష్ (రాజ రాజ చోర)

Saturday,August 14,2021 - 07:20 by Z_CLU

లై సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైన మేఘ ఆకాష్ కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ ‘రాజ రాజ చోర’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీవిష్ణు, మేఘ ఆకాష్ జంటగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 19న థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి కొన్ని విషయాలు మీడియాతో పంచుకుంది. ఆ విశేషాలు మేఘ మాటల్లోనే…

ఇప్పటి వరకు ఇలాంటి స్క్రిప్ట్ వినలేదు

హీరోయిన్ గా తమిళ్, తెలుగులో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఇలాంటి కథ మాత్రం వినలేదు. హసిత్ స్క్రిప్ట్ చెప్తున్నప్పుడే ఇది భలే ఉంది. ఇప్పటి వరకు ఈ టైప్ స్క్రిప్ట్ వినలేదు అనిపించింది. ప్రతీ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. రిలీజ్ తర్వాత ఆడియన్స్ కూడా అలాగే ఫీలయి సినిమాని ఎంజాయ్ చేస్తారు.

నా క్యారెక్టర్ లో కూడా ఫన్ ఉంది

సినిమాలో సంజన అనే డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. లుక్ కూడా కొత్తగా ఉంటుంది. అలాగే నా క్యారెక్టర్ లో ఫన్ ఉంటుంది. బట్ అది ఎక్కువగా ఉండదు కానీ కొన్ని సార్లు సీన్స్ లో ఫన్ క్రియేట్ అయింది. మిగతా క్యారెక్టర్స్ లో కూడా లిటిల్ బిట్ ఫన్ ఉంటుంది. కొన్ని సీన్స్ కి ఆడియన్స్ హిలేరియస్ గా నవ్వుతారు.

Megha Akash
ఆ సీన్ నా ఫేవరేట్

సినిమాలో నాకు శ్రీ విష్ణు కి టెంపుల్ సీన్ ఉంటది. ఆ సీన్ చేస్తున్నప్పుడు నవ్వకుండా ఉండలేకపోయాను. ఆ సీన్ థియేటర్స్ లో ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమాలో నాకది ఫేవరేట్ సీన్.

ఫన్ తో రిలీఫ్ ఇచ్చే సినిమా

రెండేళ్ళు డార్క్ డేస్ చూశాం. ఈ పరిస్థితుల్లో అందరికీ రిలీఫ్ ఇచ్చి ఎంటర్టైన్ చేసే సినిమా ‘రాజ రాజ చోర’. సినిమా చూస్తున్నప్పుడు అందరి మోఖలపై చిరునవ్వు ఉంటుంది. అది మాత్రం కచ్చితంగా చెప్పగలం. కొన్ని సీన్స్ కి హిలేరియస్ గా నవ్వుతారు. నాదీ గ్యారెంటీ.

Megha Akash
అప్పుడే విజువల్స్ చూపించాడు

మా డైరెక్టర్ హసిత్ కి ఇది ఫస్ట్ ఫిలిం. బట్ తను చాలా ఎక్స్ పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లా సినిమాను హ్యాండిల్ చేశాడు. తను స్క్రిప్ట్ చెప్పినప్పుడే విజువల్స్ చూపించేశాడు. చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. మంచి స్క్రిప్ట్ తో పాటు ఇంట్రెస్టింగ్ గా క్యారెక్టర్స్ డిజైన్ చేసుకున్నాడు. తప్పకుండా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసి సక్సెస్ అవుతాడు.

శ్రీ విష్ణు నాకంటే షై

నేను కొంచెం షై గా ఫీలవుతాను. తొందరగా ఎవరితోనూ కలిసిపోలేను. కానీ నాకంటే ఎక్కువ షై ఫీలయ్యే పర్సన్ శ్రీ విష్ణు. ఫస్ట్ టైం కలిసినప్పుడు తనకి నాకు ఆది సిమిలారిటీ అనిపించింది. మెల్లగా మాట్లాడటం మొదలు పెట్టాను. తర్వాత ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాము. అంత షై ఫీలయినా కెమెరా ముందు అదేం ఉండదు. యాక్షన్ అంటే చాలు చాలా ఈజీగా క్యాజువల్ గా చేసేస్తాడు. అది తనలో నాకు బాగా నచ్చింది.

Megha Akash
అనుకోని గ్యాప్

తెలుగులో అనుకోకుండా గ్యాప్ వచ్చింది. జెనరల్ గా నేను తమిళ్, తెలుగు మిగతా భాషల్లో కూడా సినిమాలు చేస్తున్నాను. ఎప్పుడూ లాంగ్వేజ్ ని బట్టి స్క్రిప్ట్స్ ఎంచుకోను. స్క్రిప్ట్ నచ్చితే భాషతో సంబంధం లేకుండా సినిమా చేస్తాను. నటిగా మంచి క్యారెక్టర్స్ చేయాలనుకుంటాను. ఆఫర్ వచ్చింది కదా అని ఎక్కువ సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నా. ఇకపై అన్ని అలాంటి కథలు , క్యారెక్టర్స్ తోనే సినిమా చేస్తాను.

నెక్స్ట్ సినిమాలు ఇవే

ప్రస్తుతం తెలుగులో నేను నటించిన రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ గా ఉన్నాయి. అందులో ఒకటి డియర్ మేఘ, ఇంకొకటి మను చరిత్ర. ఈ రెండు సినిమాలు కూడా నాకు మంచి పేరు తీసుకోస్తాయని అనుకుంటున్నాను. అలాగే ఇంకో ప్రాజెక్ట్ కూడా సైన్ చేశాను. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ త్వరలోనే చెప్తాను.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics