Tollywood Social Media - స్టార్స్ హంగామా

Saturday,August 14,2021 - 07:30 by Z_CLU

కొన్ని నెలలుగా బడా సినిమాల నుండి ఎలాంటి అప్ డేట్స్ లేవు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడి మళ్ళీ టాలీవుడ్ పుంజుకుంటుంది. ఈ నేపథ్యంలో స్టార్ హీరోలు వరుస అప్ డేట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారు. అవును మహేష్ , అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ కి సంబంధించి అప్డేట్స్ తో సోషల్ మీడియాలో హంగామా నడుస్తుంది.

ముందుగా ‘సర్కారు వారి పాట’ బ్లాస్టర్ అంటూ టీజర్ తో వచ్చిన సూపర్ స్టార్ మహేష్ మంచి రికార్డు వ్యూస్ కొల్లగొట్టి అందరినీ ఇంప్రెస్ చేశాడు. ఎలాంటి ఈవెంట్ లేకుండా డైరెక్ట్ గా సోషల్ మీడియాలోనే మహేష్ బర్త్ డే గిఫ్ట్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక వెంటనే బన్నీ ‘పుష్ప’ సాంగ్ తో సోషల్ మీడియాలో సందడి మొదలు పెట్టాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పుష్ప ఫస్ట్ సింగిల్ లో అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్నాడు ఐకాన్ స్టార్. ఈ సాంగ్ యూ ట్యూబ్ లో ట్రెండవుతుంది. అలాగే ట్విట్టర్ , ఫేస్బుక్ , ఇంస్టా ఇలా అన్ని సోషల్ మీడియాలో సాంగ్ తిరుగుతుంది.

ఇక మహేష్ , బన్నీ తమ ఫ్యాన్స్ కి అప్డేట్స్ తో పండగ తీసుకొస్తే తన ఫ్యాన్స్ కి కూడా ట్రీట్ ఇచ్చి సెలెబ్రేషన్ మూడ్ తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు పవర్ స్టార్. అవును పవన్ కళ్యాణ్ కూడా ఫస్ట్ లుక్ గ్లిమ్స్ తో సోషల్ మీడియా ని షేక్ చేయడానికి రాబోతున్నాడు. ఆగస్ట్ 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పవన్ , రానా సినిమా నుండి గ్లిమ్స్ రానుంది. తాజాగా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ స్టిల్ తో పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్.

సో ఇలా టాప్ హీరోలు ఒకరి తర్వాత ఒకరు తమ సినిమా ప్రమోషన్ తో సోషల్ మీడియాలో భారీ హంగామా చేస్తూ వ్యూస్ తో షేక్ చేస్తున్నారు. మరి వీరి తర్వాత అప్ డేట్ తో వచ్చే మరో స్టార్ హీరో ఎవరో చూడాలి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics