మంచు విష్ణు సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్

Monday,March 20,2017 - 10:03 by Z_CLU

ఒకేసారి 2 సినిమాలు షురూ చేశాడు మంచువారబ్బాయ్ మంచు విష్ణు. ఇప్పటికే ఆచారి అమెరికా యాత్ర అనే సినిమాను స్టార్ట్ చేసిన విష్ణు.. త్వరలోనే కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా ప్రారంభించనున్నాడు. ఈ సినిమాకు ఓటరు అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు. మోహన్ బాబు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఈ టైటిల్ ను విడుదల చేశారు.

ఒకేసారి రెండు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలు చేయడానికి రెడీ అవుతున్నాడు విష్ణు. ఆచారి అమెరికా యాత్రలో బ్రహ్మానందంతో కలిసి కామెడీ పండించడానికి రెడీ అయిన ఈ హీరో… ఓటరు సినిమాలో సీరియస్ రోల్ లో కనిపించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఇదొక పొలిటికల్ థ్రిల్లర్ అని తెలుస్తోంది.

జాన్ సుధీర్ నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమాలో సురభి హీరోయిన్ గా సెలక్ట్ అయింది. ఇప్పటికే జెంటిల్ మేన్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి సినిమాలతో ఈ అమ్మాయి గుర్తింపుతెచ్చుకుంది. ఓటరు ప్రాజెక్ట్ ఓపెనింగ్ డేట్, రెగ్యులర్ షూటింగ్ వివరాలు త్వరలోనే తెలుస్తాయి.