సోషల్ మీడియాలో పవన్, బన్నీ హల్ చల్

Monday,March 20,2017 - 10:57 by Z_CLU

మెగా హీరోలు పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. వీళ్లు నటిస్తున్న కొత్త సినిమాలు యూట్యూబ్ తో తెగ సందడి చేస్తున్నాడు. బన్నీ నటిస్తున్న డీజే సినిమా టీజర్ ను ఈమధ్యే యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈ టీజర్ కు ఇప్పుడు ఏకంగా కోటి వ్యూస్ వచ్చాయి.

అటు పవన్ నటిస్తున్న కాటమరాయుడు సినిమా ట్రయిలర్ కూడా యూట్యూబ్ లో హంగామా చేస్తోంది. విడుదలై 48 గంటలైనా కాాకముుందే ఈ సినిమాకు 20లక్షల వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఈ ట్రయిలర్ 27లక్షలకు పైగా వ్యూస్ తో… 3 మిలియన్ మైల్ స్టోన్ ను క్రాస్ చేేసేందుకు దూసుకుపోతోంది.

డీజే సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక పవన్ నటించిన కాటమరాయుడు సినిమా ఈ వీకెండ్ థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది.