హుషారు రిలీజ్ డేట్ ఫిక్స్

Saturday,December 08,2018 - 02:15 by Z_CLU

లక్కీ మీడియా సంస్థలో 9వ చిత్రంగా వస్తున్న మ్యూజికల్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘హుషారు’ అన్ని హంగులతో ఈ నెల డిసెంబర్ 14న విడుదల అవుతుంది. ఇటీవలే ఎంతో ఉత్సాహంగా బస్సు టూర్ లో భాగంగా తెలంగాణ ,ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ప్రధాన నగరాల్లో కాలేజీలకు ‘హుషారు’ టీం రౌండ్స్ కొట్టింది.

‘హుషారు’ సినిమాలో ఎంతో ట్రెండింగ్ లో ఉన్న ”వెళ్ళిపోమాకే” ”పిచాక్” పాటలు కుర్రాళ్లను బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. అన్ని కారిక్రమాలను పూర్తి చేసుకుని ఈ సినిమాని ఈ నెల 14 న విడుదలకి సిద్దంచేస్తున్నారు.

బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ఈ హుషారు కి రియాజ్ మరో నిర్మాత. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు .*తేజస్ కంచెర్ల ,తేజ్ కూరపాటి ,దినేష్ తేజ్ , అభినవ్ మేడిశెట్టి హీరోలుగా,దక్ష నగరకర్, ప్రియా వడ్లమాని, హేమల్ హీరోయిన్లు గా నటించారు.రాహుల్ రామకృష్ణ ముఖ్యపాత్ర లో నటించారు.