'శైలజారెడ్డి అల్లుడు' ..వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్

Saturday,December 08,2018 - 06:35 by Z_CLU

నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్‌ జంటగా నటించిన శైలజారెడ్డి అల్డుడు సినిమాను వరల్డ్‌ టెలివిజన్‌ ప్రీమియర్‌గా ప్రసారం చేయబోతోంది మీ జీ తెలుగు9 డిసెంబర్‌ సాయంత్రం 5.30లకు.. శైలజారెడ్డి అల్లుడు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డీ చానెల్స్‌లో వీక్షించండి అద్భుతమైన కార్యక్రమాలతో అనునిత్యం మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేస్తోంది మీ జీ తెలుగు. ఇప్పుడు అలాంటి ఎంటర్‌టైనర్‌తో మిమ్మల్ని కడుపుబ్బ నవ్వించేందుకు సిద్ధమైంది జీ తెలుగు. అదే సూపర్‌హిట్‌ సినిమా శైలజా రెడ్డి అల్లుడు. ఈ సినిమాను ఇప్పుడు వరల్డ్‌ టెలివిజన్‌ ప్రీమియర్‌గా మీ ముందుకు తేబోతుంది. ఈ సూపర్‌హిట్‌ సినిమా ఈ డిసెంబర్‌ 9న సాయంత్రం 5.30 నిమిషాలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డీ ఛానెల్స్‌లో ప్రసారం కాబోతుంది.

శైలజారెడ్డి అల్లుడు సినిమా కథ విషయానికి వస్తే.. చైతన్య (నాగచైతన్య) తండ్రి పెద్ద వ్యాపారవేత్త. అన్నింటికి మించి పెద్ద ఇగోయిస్ట్‌. నాగచైతన్య అను (అను ఇమ్మాన్యుయేల్‌) ప్రేమలో పడతాడు. అయితే ఒకానొక సమయంలో.. అనుకోకుండా.. చైతన్యు, అనుకు ఎంగేజ్‌మెంట్‌ అయిపోతుంది. కానీ అను తల్లి.. అనుకి డాక్టర్‌ను ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటుంది. ఈ నేపథ్యంలో.. అను, ఆమె తల్లిని ఒప్పించేందుకు సిద్ధమవుతాడు చైతన్య. ఇందుకోసం అను వాళ్ల ఊరికి వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాతే చైతన్యకు అర్థం అవుతుంది అను, ఆమె తల్లి గత కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుకోవడం లేదని. వాళ్లిద్దర్ని ఒక్కటి చేసి తన ప్రేమని గెలిపించుకోవాలని ప్రయత్నిస్తాడు చైతన్య. మరి చైతన్య తల్లి కూతుళ్లని కలిపాడా, తన ప్రేమని గెలిపించుకున్నాడా అనేదే మిగిలిన స్టోరీ.

మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎమోషన్స్‌తో పాటు అదిరిపోయే కామెడీ కూడా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా.. తన ప్రేమ కోసం ముగ్గురు ఇగోయిస్టుల మధ్య నలిగిపోయిన పాత్రలో నాగచైతన్య అద్భుతంగా నటించాడు. తన ప్రేమని గెలిపించుకోవడం కోసం చైతూ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు.. ఎలా విజయవంతం అయ్యాడు అనేది ఆద్యంతం అద్భుతంగా చిత్రీకరించాడు దర్శకుడు మారుతి.