హాట్ టాపిక్ : మెగాస్టార్ తో వినాయక్ సినిమా ?

Tuesday,March 03,2020 - 10:02 by Z_CLU

టాలీవుడ్ లో మెగా స్టార్ నెక్స్ట్ సినిమా వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం కొరటాల డైరెక్షన్లో 152వ సినిమా చేస్తున్న చిరు త్వరలోనే 153 వ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు చూస్తున్నారట. ఇటివలే రైటర్ ప్రసన్న కుమార్ చిరుని కలిసి ఓ యాక్షన్ డ్రామా సబ్జెక్ట్ చెప్పాడని. కథ నచ్చడంతో మెగాస్టార్ ప్రసన్న స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.

అయితే ఈ కథను ఏ దర్శకుడి చేతిలో పెట్టాలనే ప్రశ్నలో భాగంగా ముందుగా వినాయక్ పేరు వినబడిందని సమాచారం.తాజాగా మెగా కాంపౌండ్ నుండి వినాయక్ కి కబురు కూడా వెళ్లిందని, వినాయక్ తో మెగా 153 సినిమా కన్ఫర్మ్ అని టాక్ వినబడుతుంది.

సినిమాలో చిరు ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ క్యారెక్టర్ లో కనిపించనున్నారని తెలుస్తుంది. మరి ఈ మెగా సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడొస్తుందో చూడాలి.