జీ స్పెషల్ : వారసులొచ్చారు

Tuesday,March 03,2020 - 01:02 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ వారసులు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మ్యూజిక్ లవర్స్ ను ఎట్రాక్ట్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తండ్రి పేరు నిలబెట్టడానికి తమ వంతు ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ పై ‘జీ సినిమాలు‘ స్పెషల్ స్టోరీ.

కీరవాణి మ్యూజిక్ వింటుంటే చాలా హాయిగా ఉంటుంది. ఇప్పటికీ ఆయన సంగీతం మీదే కొన్ని పెద్ద సినిమాల అవుట్ పుట్ ఆధారపడి ఉంటుంది. అయితే ఆ మధ్య ఇక తను మ్యూజిక్ కి గుడ్ బై చెప్పనున్నాని మనసులో మాట బయటపెట్టారు కీరవాణి. ‘బాహుబలి 2’ చివరి చిత్రం అవుతుందేమో అన్నారు. ఆయన అభిమానులు మాత్రం కీరవాణి సంగీతం ఇంకా కొన్నేళ్ళు వినాలనుందని ఆయనతో చెప్పుకున్నారు. తర్వాత ఆయన కూడా నిర్ణయం మార్చుకొని ప్రస్తుతం సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నారు. అయితే కీరవాణి కుటుంబం ఈ జెనెరేషణ్ కి మరో మ్యూజిక్ డైరెక్టర్ ను అందిస్తే బాగుంటుందనుకుంటున్న సమయంలో కీరవాణి తనయుడు కాల భైరవ సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. మొన్నటి వరకూ సింగర్ గా అడపాదడపా పాటలు పాడిన కాల భైరవ లేటెస్ట్ గా ‘మత్తు వదలరా’ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా లాంచ్ అయ్యాడు. మొదటి సినిమాకే మ్యూజిక్ తో మేజిక్ చేసి ప్రశంసలు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ‘ఆకాశవాణి’, ‘కార్తికేయ 2’ సినిమాలకు సంగీతం అందిస్తూ మ్యూజిక్ డైరెక్టర్ గా బిజీ అయ్యాడు.

మెలోడీ బ్రహ్మ మణిశర్మకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మ్యూజిక్ లవర్స్ ప్లేయ్ లిస్టులో ఖచ్చితంగా మణిశర్మ కంపోజ్ చేసిన మెలోడీ సాంగ్స్ ఉంటాయి. ఇక నేపథ్య సంగీతం విషయంలోనూ ఆయన బెస్ట్ అనిపించుకున్నారు. మొన్నటి వరకూ గ్యాప్ తీసుకున్నప్పటికీ ప్రస్తుతం మళ్ళీ మునుపటి స్పీడ్ తో వరుస సినిమాలు చేస్తున్నారు. ఇక మణిశర్మ తర్వాత ఆయన ఫ్యామిలీ నుండి మరో మ్యూజిక్ డైరెక్టర్ ని ఎక్స్ పెక్ట్ చేయొచ్చా అని ఆయన మ్యూజిక్ అభిమానులు అనుకుంటుండగానే ‘జాదూగాడు’ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు సాగర్ మహతి. ఆ తర్వాత ‘ఛలో’ ఆల్బంతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు. సినిమాలో ‘చూసీ చూడంగానే’ సాంగ్ తో మ్యూజిక్ డైరెక్టర్ గా హాట్ టాపిక్ అయ్యాడు. ప్రస్తుతం ‘భీష్మ’ సినిమాతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకొని మణి శర్మ వారసుడిగా కాకుండా తనకంటూ ఓన్ బ్రాండ్ బిల్డ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు.

సో ఈ ఇద్దరు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ తమ మ్యూజిక్ జర్నీలో చివరికి తండ్రికి తగ్గ తనయుడు అనే ప్రశంస దక్కించుకొని టాప్ ప్లేస్ కెళ్ళాలని ఆశిస్తోంది ‘జీ సినిమాలు‘.