హారర్ లో రొమాన్స్... ఇదో డిఫరెంట్ మూవీ

Saturday,July 22,2017 - 04:00 by Z_CLU

విజయ్‌ రాఘవేంద్ర హీరోగా హరిప్రియ హీరోయిన్‌గా ఆదిరామ్‌ దర్శకత్వంలో కన్నడంలో ఎస్‌.రమేష్‌ నిర్మించిన ‘రణతంత్ర’ చిత్రం సమ్మర్‌లో రిలీజై మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని  ‘ఇది పెద్ద సైతాన్‌’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. యాక్షన్‌ రొమాంటిక్‌ హర్రర్‌గా రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్‌ 4న విడుదల కానుంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో హారర్ కామెడీ చిత్రాల హవా కొనసాగుతోంది. అందుకే హారర్ రొమాంటిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన తమ సినిమా కూడా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉంది యూనిట్. మరీ ముఖ్యంగా హరిప్రియ తెలుగమ్మాయి కావడంతో.. సినిమాకు రీచ్ పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాకు కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం ఆదిరామ్‌.