`మోస‌గాళ్ళు` భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌

Sunday,January 19,2020 - 01:09 by Z_CLU

విష్ణు మంచు హీరోగా న‌టిస్తూ నిర్మిస్తోన్న చిత్రం `మోస‌గాళ్ళు`. జెఫ్రీ గీ చిన్ ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. విష్ణు మంచు, సునీల్ శెట్టి మ‌ధ్య భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌ను ప్రస్తుతం చిత్రీక‌రిస్తున్నారు.

హాలీవుడ్ యాక్ష‌న్ కొరియోగ్రాఫర్స్ ఆధ్వ‌ర్యంలో..  హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్‌లో ఈ యాక్ష‌న్ సీన్‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు తెర‌పై రాన‌టువంటి విధంగా ఈ యాక్ష‌న్ సీన్ ఉండ‌బోతుంద‌ని మేక‌ర్స్ అంటున్నారు. ఈ స‌న్నివేశం కోసం ఇద్ద‌రు స్టార్స్ ప్ర‌త్యేక‌ంగా శిక్ష‌ణ‌ కూడా తీసుకుంటున్నారు.

అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని వేస‌విలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

న‌టీన‌టులు:
విష్ణు మంచు, సునీల్ శెట్టి, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, న‌వ‌దీప్‌, న‌వీన్ చంద్ర‌, రూహి సింగ్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
నిర్మాత‌:  విష్ణు మంచు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  విజ‌య్ కుమార్‌.ఆర్‌
ద‌ర్శ‌క‌త్వం:  జెఫ్రీ గీ చిన్‌
సినిమాటోగ్ర‌ఫీ:  షెల్డ‌న్ చౌ
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:  కిర‌ణ్ కుమార్‌.ఎం