Sreeleela భారీ ఆఫర్ సొంతం చేసుకున్న హీరోయిన్ ?

Tuesday,February 15,2022 - 07:14 by Z_CLU

కొందరు హీరోయిన్స్ మొదటి సినిమాకే క్రేజ్ తెచ్చుకొని భారీ ఆఫర్స్ అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరీర్ లీడ్ చేస్తూ తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్స్ లిస్టు లో చేరిపోతారు. ఈ లిస్టులో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. ఇప్పుడు శ్రీలీల కూడా అందులో చేరబోతోంది. అవును రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ‘పెళ్లి సందD’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీలీల మొదటి సినిమాతో ఎక్కడలేని క్రేజ్ అందుకుంది. ముఖ్యంగా సాంగ్స్ లో తన గ్లామర్ తో కుర్రకారుని బాగా ఎట్రాక్ట్ చేసింది. అందుకే టాలీవుడ్ లో ఈ అమ్మడుకి వరుస ఆఫర్స్ వస్తున్నాయి.

ప్రస్తుతం రవితేజ తో ‘ధమాకా’ అనే సినిమా చేస్తుంది శ్రీలీల.  ఇటివలే రవితేజ , శ్రీలీల కలిసి ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. రెండో సినిమా సెట్స్ పై ఉండగానే ఈ అమ్మడికి మరిన్ని ఆఫర్స్ వచ్చి పడుతున్నాయ్ అంట. ఇక తాజాగా ఓ భారీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా ఈ అమ్మడి పేరు పరీశీలనలో ఉందని తెలుస్తుంది.

ప్రభాస్ హీరోగా మారుతీ ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి త్వరలోనే డీటెయిల్స్ చెప్తామని మారుతి సోషల్ మీడియాలో చెప్పుకున్నాడు కూడా. అయితే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని అందులో ఒక హీరోయిన్ గా శ్రీలీల ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారని టాక్ వినబడుతుంది. ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న ఈ విషయం నిజమైతే ఇక టాలీవుడ్ లో శ్రీలీల కి తిరుగే లేదు.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics