Interview - కిషోర్ తిరుమల (ఆడవాళ్ళు మీకు జోహార్లు)

Wednesday,February 16,2022 - 04:14 by Z_CLU

Kishore Tirumala Interview on ‘Aadavallu Meeku Johaarlu’

 ‘రెడ్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కిషోర్ తిరుమల ఇప్పుడు శర్వానంద్ హీరోగా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెలాఖరున రిలీజ్ అవ్వబోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు కిషోర్ తిరుమల మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు కిషోర్ మాటల్లోనే.

ఈ కథ వేరు , ఆ కథ వేరు 

వెంకటేష్ గారితో నేను చేయాలనుకున్న కథ వేరు, ఈ కథ వేరు. ఎందుకో ఆ సినిమా సెట్ అవ్వలేదు. త్వరలోనే కచ్చితంగా ఆయనతో సినిమా చేస్తాను. కాకపోతే టైటిల్ హీరో బ్యాగ్రౌండ్ ఒకటే. ఆ రెండు తీసుకొని రెడీ చేసిన మరో కథ ఇది. శర్వానంద్ ఓ సందర్భంలో మీ దగ్గర ఓ పాయింట్ ఉందని విన్నాను. ఆ స్క్రిప్ట్ చేద్దాం అన్నాడు. వెంటనే స్క్రిప్ట్ డెవలప్ చేసి తనకి నెరేట్ చేశాను. శర్వాకి బాగా నచ్చి వెంటనే సెట్స్ పైకి వెళ్ళిపోయాం.

మన లైఫ్ లో ఎలిమెంట్స్ తీసుకునే 

ఎప్పుడూ మన చుట్టూ జరిగే కథలే ఎంచుకుంటూ దానికి ఓ ఎమోషన్ యాడ్ చేసి సినిమాలు చేస్తుంటాను. ఈ కథ కూడా అలా పుట్టిందే. మన రియల్ లైఫ్ లో మనం ఫేస్ చేసేవి తీసుకుని అల్లిన కథ ఇది.  మన అమ్మ నుండి కూతురు వరకూ ఆడవాళ్ళు మన లైఫ్ లో కీ రోల్స్ పోషిస్తుంటారు. వారిని పెట్టి ఒక సినిమా ఎందుకు చేయకూడదు అనే ఆలోచన నుండి పుట్టిన కథ ఇది. సినిమా చూసినంత సేపు మన లేడీస్ గుర్తొస్తుండాలి అనే ఉద్దేశ్యంతో చేసిన సినిమా ఇది.

అందరికీ ఇంపార్టెన్స్ ఉంటుంది 

సినిమాలో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. ఆ ఆడవాళ్ళ మధ్యలో మగాడిలా ఉండే వ్యక్తి శర్వా. కథలో ప్రతీ ఒక్కటికీ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఏ క్యారెక్టర్ లేకపోయిన సినిమా ఇన్ కంప్లీట్ గా అనిపిస్తుంది.

స్క్రిప్టింగ్ అప్పుడే వాళ్ళని అనుకున్నా 

ఈ సినిమా స్క్రిప్టింగ్ లోనే రాధికా గారు , ఖుష్బు గారు , ఊర్వసి గారు ఈ క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుందని అనుకున్నా. కథలో చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఇవి. ఎక్స్ పీరియన్స్  నటులైతేనే పాత్రలు క్లిక్ అవుతాయి. అప్రోచ్ అయి చెప్పగానే వాళ్ళు కూడా ఎగ్జైట్ అయ్యారు. వాళ్ళ క్యారెక్టర్స్ అందరినీ ఆకట్టుకుంటారు.

అందరి సపోర్ట్ తోనే 

ఇంత మంది ఆర్టిస్టులతో అనుకున్న విధంగా షూట్ కంప్లీట్ చేయడం అంటే మాములు విషయం కాదు. ఆ విషయంలో ఆర్టిస్ట్ లందరూ సపోర్ట్ చేశారు. ఇంతమంది ఆడవాళ్ళను పెట్టి ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా ఎవరూ చేయలేదు. మనకోసం ఒక కథ రాసుకున్నాడు. ఇతనికి సపోర్ట్ చేయాలి అన్నట్టుగా ఎప్పటికప్పుడు మిగతా సినిమాలు ఉన్నప్పటికీ అందరూ సపోర్ట్ చేస్తూ అడిగిన వెంటనే డేట్స్ అడ్జస్ట్ చేస్తూ వచ్చారు. వారి సపోర్ట్ లేకపోతే అనుకున్నట్లు కంప్లీట్ అయ్యేది కాదు.

రష్మిక అదొక్కటే అడిగింది 

రష్మిక కి ఈ కథ ఏడాదిన్నర క్రితం చెప్పాను. నెరేషన్ వినేటప్పుడు బాగా నవ్వుతూ ఎంజాయ్ చేసింది. తనకి స్టోరీ బాగా నచ్చింది. మీరు చెప్పింది చెప్పినట్టు స్క్రీన్ మీదకి వస్తుంది కదా అని మాత్రమే అడిగింది. అలాగే వస్తుందని చెప్పాను. ‘నేను శైలజా’ లో శైలజా క్యారెక్టర్ కి కీర్తి ఎలా సూటయ్యిందో ఈ పాత్రలో రష్మిక అలా ఉంటుంది.

అదేం ఉండదు 

ఈ సినిమా పాజిటివ్ ఎమోషన్ తోనే ఉంటుంది. విలన్ ఉండటం వాడిని కొట్టడం లాంటివి ఏం ఉండవు. సెంటిమెంట్ , డ్రామా వీటిపై ఎక్కువ ఫోకస్ పెట్టలేదు.ఫస్ట్ టైం నేను ఎంటర్టైన్ మెంట్ ఎక్కువ ట్రై చేశాను. సినిమా ఎప్పటికప్పుడు నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తుంది. కొన్ని సీన్స్ లో సింపుల్ ఫన్ ఉంటుంది కానీ నవ్విస్తుంది. కొన్ని సార్లు మనల్ని రిలేట్ చెసుకుంటూ అర్రే మనింట్లో కూడా ఇలాగే అంటారే అనుకుంటూ ఎంజాయ్ చేస్తారు.

ప్రతీ సాంగ్ అలాగే ఉంటుంది 

మ్యూజిక్ లేకుండా నా కథల్ని ఊహించుకోలేను. దేవి నేను ఎప్పుడూ మ్యూజిక్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. నేను డైరెక్ట్ చేసిన సినిమాలకన్నిటికి మంచి సాంగ్స్ ఇచ్చాడు. ఈ ఆల్బం కూడా సినిమాకు ప్లస్ అవుతుంది. ఇందులో ప్రతీ సాంగ్ స్టోరీ టెల్లింగ్ తో ఉంటుంది.

నెక్స్ట్ సినిమా ఇదే 

నెక్స్ట్ సినిమా దానయ్య గారి బేనర్ లో ఓ లవ్ స్టోరీ చేయబోతున్నాను. నాగ చైతన్య హీరోగా ఆ సినిమా చేయబోతున్నాను. ప్రెజెంట్ చైతూ తన లైనప్ తో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics