Interview -వరుణ్ తేజ్ (ఎఫ్ ౩)

Thursday,May 26,2022 - 04:23 by Z_CLU

Hero Varun Tej Interview about F3 movie

విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఫన్ ఫ్రాంచైజీ ‘ఎఫ్ ౩’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రేపే థియేటర్స్ లోకి వస్తుంది. ఈ సందర్భంగా మెగా ప్రిన్స్ మీడియాతో ముచ్చటించాడు. వరుణ్ చెప్పిన ఎఫ్ ౩ విశేషాలు తన మాటల్లోనే…

ప్లాన్ చేసింది కాదు

‘గని’, ‘ఎఫ్౩’ రెండూ బ్యాక్ టు బ్యాక్ రిలీజయ్యాయి. నిజానికి ఇది అనుకొని ప్లాన్ చేసుకోలేదు. కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ ఇలా నెలల గ్యాప్ లో వచ్చాయి.

బాగా నమ్మిన సినిమా..అందుకే నోట్ 

‘గని’ సినిమాతో దాదాపు మూడేళ్ళు ట్రావెల్ చేశాను. మేము మూడేళ్ళుగా అప్పుడప్పుడు కంటెంట్ చూసుకుంటూ ఎక్కువ నమ్మాము. కానీ మా జడ్జిమెంట్ రాంగ్ అయింది.  బేసిక్ గా సినిమా ఆడుతుంది , బాగుంటుంది అని నేనెప్పుడు స్టేట్ మెంట్స్ ఇవ్వను. కానీ గని కి జెన్యూన్ గా అనిపించి అలాంటి స్టేట్ మెంట్ ఇచ్చాను. కానీ సినిమా వర్కౌట్ అవ్వలేదు. జెనెరల్ గా ఎవరికీ ఎక్స్ ప్లైనేషణ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆ మాట చెప్పాలనిపించి నోట్ రిలీజ్ పోస్ట్ చేశాను. అది నా సాటిస్ఫాక్షన్ కోసం పెట్టుకున్నాను అంతే.

f3 movie venkatesh varun tej
ఎఫ్౩ చేద్దామని అప్పుడే అనుకున్నాం

నిజానికి ఎఫ్ 3 చేయాలని ఎఫ్ 2 షూటింగ్ మధ్యలోనే అనుకున్నాం. హానెస్ట్ గా చెప్పాలంటే అనిల్ గారు ఎక్కువ భయపడాలి. అంత పెద్ద హిట్ తర్వాత మళ్ళీ ఫ్రాంచైజీ అంటే దానికి మించి ఎంటర్టైన్ చేయాలి. అనిల్ గారికి ఉన్న స్ట్రెంగ్త్ కామెడీ నే కాబట్టి మళ్ళీ ఈ సినిమా కుదిరింది. డబ్బు గురించి అనుకుంటున్నా అంటూ రెండు మూడు సీన్లు చెప్పినప్పుడే నాకు వెంకటేష్ గారికి అనిల్ మంచి కంటెంట్ ప్లాన్ చేస్తున్నారని అర్థమైంది. ఇక ‘ఎఫ్ 2’ అంత పెద్ద హిట్ అయ్యాక తప్పకుండా ఫ్రాంచైజీ చేయాలని అనిల్ గారికి అనిపించింది. వెంకటేష్ గారు కొన్నేళ్లుగా థియేటర్స్ లో సినిమాలు చూడలేదు. నేనే ‘ఎఫ్ 2’ కి థియేటర్స్ కి తీసుకెళ్ళాను. థియేటర్స్ ఆడియన్స్ ఎంజాయ్ మెంట్ చూసి కారులో కూర్చొని మనం ఎఫ్ ౩ చేద్దాం అని వెంకటేష్ గారే అన్నారు. షూర్ విల్ డూ ఇట్ అనేశా.

కామెడీ చేయడం చాలా కష్టం

యాక్షన్ , ఫైట్స్ అంటే కష్టం కానీ కామెడీ ఏముంది అనుకునే వాడిని కానీ కామెడీ చేయడం చాలా కష్టమని ఎఫ్ 2 చేశాక అర్థమైంది. ఎఫ్ ౩ లో నా కేరెక్టర్ కి ఆడాన్ చేయాలి నత్తి అనుకుంటున్నాను అని చెప్పారు. రే చీకటి ఉన్నోడు , నత్తి ఉన్నోడు ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు రాత్రి సీన్లు ఇమాజినేషన్ చేసుకుంటే నవ్వొస్తుంది. ఒకడు చూడలేదు ఇంకొకడు మాట్లాడలేదు. అలా చిన్న ఐడియా అనుకుని సీన్స్ డిజైన్ చేసుకొని అనీల్ గారు మా కేరెక్టర్స్ కి ఎక్స్ట్రా ఆడాన్ చేశారు. సినిమాలో కొన్నిసార్లు ఆ ట్రాక్ వచ్చినప్పుడు హిలేరియస్ గా ఉంటుంది.

కష్టమనిపించలేదు

నిజానికి నత్తి పెట్టడం వల్ల నాకేమి కష్టమనిపించలేదు. అనీల్ గారు ముందే చేసి చూపించేవారు. దాంతో ఈజీగానే చేసేశాను. ఎప్పుడైనా ఒక డైరెక్టర్ కి క్లారిటీ ఉండి తనకి ఏం కావాలో తెలిసినప్పుడు మన జాబ్ చాలా ఏజీ అయిపోతుంది. ట్రైలర్ లో చెప్పిన డైలాగ్ ఫస్ట్ డే తీసింది అప్పటి వరకూ ఎలా చేస్తానా అనే సందేహంతో పాటు కాస్త టెన్షన్ కూడా ఉండేది. కానీ అది బాగా వచ్చిందని అనీల్ గారిచ్చిన కాన్ఫిడెన్స్ తో డే 2 నుండి ఈజీగానే చేసుకుంటూ వెళ్లాను.

కొన్ని చోట్ల ఉంటుంది

యానిమేటెడ్ కామెడీ కొన్ని చోట్ల ఉంటుంది. సెకండాఫ్ లో వస్తుంది. అయినా ఇది ఏ టైప్ కామెడీ అనేది స్పెసిఫిక్ గా చెప్పలేను. స్లాప్ స్టిక్ ఆ , నేచురల్ ఆ యానిమేటెడ్ కామెడీ ఆ చెప్పలేను. అవుట్ అండ్ అవుట్ కామెడీ కాబట్టి అన్ని మిక్సయి ఉంటాయి. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు.

ఆడియన్స్ ని ఫన్

సినిమాలో వీళ్ళు డబ్బులు కొట్టేస్తే ఫన్ అనుకుంటారు కానీ దాని వల్ల వచ్చే ఫ్రస్ట్రేషన్ ఆడియన్స్ ని ఫన్ వచ్చేలా చేస్తుంది. డిఫరెంట్ కేరెక్టర్స్ వాటి నుండి వచ్చే ఫన్ థియేటర్స్ లో బాగా ఎంటర్టైన్ చేస్తుంది.


వ్యక్తిగా చాలా ఇష్టం

వెంకటేష్ గారు చాలా మందితో మల్టీ స్టారర్స్ చేశారు బాబాయి కూడా ఆయనతో వర్క్ చేశారు. కానీ నాకు మాత్రమే ఆయనతో రెండో సినిమా చేసే అవకాశం దక్కింది. నటుడిగా అయన ఇష్టం. వ్యక్తిగా మరింత ఎక్కువ ఇష్టం. ఒక బ్రదర్ లా ఫాదర్ లా ఫ్రెండ్ లా అన్ని రకాలుగా ఉంటారు. చాలా విషయాలు మాట్లాడుకుంటాం. అప్పుడప్పుడు రానా కి ఫోన్ చేసి మీ బాబాయ్ నీకు చెప్పనివి నాకు చెప్తుంటారు అని ఆట పట్టిస్తుంటా. ముఖ్యంగా అయన నుండి డిసిప్లెన్ నేర్చుకున్నాను. టైం అంటే టైం కి వస్తారు. ఆయనతో కాంబినేషన్ అంటే నేను కూడా త్వరగా బయలుదేరాల్సి వస్తుంది.

సాంగ్ లో దూరంగా ఉంటాను

సినిమాలో మెహ్రీన్ కి నాకు రొమాంటిక్ సీన్స్ ఉండవు. సాంగ్ ప్రోమో చూస్తే నేను కొంచెం దూరంగా ఉంటాను. సినిమాలో లవ్ అనేది ఉంది కానీ అమ్మాయి ,అబ్బాయికి మధ్య లవ్ కాదు. డబ్బుకి మనిషికి మధ్య లవ్. ప్రతీ ఒక్కరు డబ్బు ని ప్రేమిస్తారు.

f3-movie-12
షూటింగ్ గ్యాప్ లో

ఎఫ్ 2 చేయడం వల్ల ఇందులో ఆర్టిస్టులమంతా చాలా ఫ్రీ గా ఉండే వాళ్ళం. షూటింగ్ గ్యాప్ లో కుర్చీలు వేసుకొని సరదాగా మాట్లాడుకునే వాళ్ళం. వై విజయ గారు , అన్నపూర్ణమ్మ గారు , రాజేంద్ర ప్రసాద్ గారు , ప్రగతి గారు , ప్రదీప్ గారు రఘు బాబు గారు అఫ్కోస్ వెంకటేష్ గారు ఇలా అందరం కూర్చొని టైం స్పెంట్ చేశాం. ఒక్కో రోజు ఎవరో ఒకరు ఫుడ్ తేవడం కలిసి తినడం చాలా హ్యాపీ మూమెంట్స్. ఒక ఫ్యామిలీలా కలిసి వర్క్ చేశాం.

ఎఫ్ 2 కి సీక్వెల్ కాదు..కానీ 

ఎఫ్ 2 కి ఎఫ్ ౩ సీక్వెల్ కాదు. ఆ కథ వేరు ఈ కథ వేరు. కాకపోతే అవే కేరెక్టర్స్ ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇది కేరెక్టర్స్ పరంగా సీక్వెల్ కానీ కథ పరంగా కానే కాదు. ఈ కథ డబ్బు చుట్టూ తిరుగుతుంది.

ఫ్యామిలీ షాకయ్యారు

ట్రైలర్ ఇంట్లో పది మందితో కలిసి చూశాను. తేజ్ ఇంకా కజిన్స్ ఉన్నారు. వాళ్ళు చూసి షాకయ్యారు. ఇంట్లో నేను చాలా సైలెంట్ గా ఉంటాను. గట్టి గట్టిగా మాట్లాడను. ట్రైలర్ లో డైలాగ్స్ అవన్నీ చూసి వాళ్లకి సర్ ప్రయిజ్ అనిపించింది. బహుశా వారు షూటింగ్ కి రాకపోవడం ఈ కేరెక్టర్ ఇలా ఉంటుంది అని తెలియకపోవడం వల్ల అలా ఫీలయ్యారేమో అనుకున్నాను. నాన్న చూడగానే బాగుంది అన్నారు. అలాగే చరణ్ అన్న కూడా ఫోన్ చేసి మాట్లాడాడు. వాళ్ళు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా.

f3 movie stills zeecinemalu
రోజుకో సెట్

రాజు గారు చాలా ఫ్యాషన్ ఉన్న నిర్మాత. నాకు వెల్ విషర్ గా ఉంటారు. ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉండటం వల్ల రోజుకో సెట్ కి వెళ్తూ ఉండేవారు. మా సెట్ కి ఆయన వచ్చింది తక్కువే. శిరీష్ గారే మొత్తం చూసుకున్నారు. ఇద్దరితో మంచి బాండింగ్ ఉంది. ఈ సినిమా వాళ్ళకి మంచి లాభాలు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను.

f3-movie-stills-zeecinemalu1

సునీల్ గారు మళ్ళీ ఇన్నాళ్ళకి 

నా కాలేజ్ డేస్ సునీల్ గారి కామెడీ బాగా ఎంజాయ్ చేసే వాడిని. ఆయన టైమింగ్ చాలా ఇష్టం. నా ఫేవరేట్ కమెడియన్ అన్నమాట. తర్వాత హీరోగా మారిపోయాక ఆ కామెడీ నాతో పాటు అందరూ మిస్ అయ్యారు. ఆయన తర్వాత కొన్ని కామెడీ కేరెక్టర్స్ చేసిన పాత సునీల్ కనిపించలేదు. అనీల్ గారు సునీల్ గారిని మళ్ళీ ఒకప్పటి కమెడియన్ గా చూపించే ప్రయత్నం చేశారు. నాతో త్రూ అవుట్ ఉండే కేరెక్టర్ లో సునీల్ గారి కామెడీ హిలేరియస్ గా ఉంటుంది. కచ్చితంగా ఒకప్పటి సునీల్ కామెడీ గుర్తొస్తుంది.

‘ఎఫ్ 4’ కోసం నాలుగు పాయింట్స్

ఎఫ్ 4 కి ఇలా అనుకుంటున్నా అంటూ షూటింగ్ స్టేజిలో అనీల్ గారు నాకు వెంకీ గారికి నాలుగు పాయింట్స్ చెప్పారు. ఇందులో డబ్బు తీసుకున్నట్లు ఇంకో నాలుగు అనుకుంటున్నారు. మరి వాటిలో ఏది సెట్ అవుతుందో ఎఫ్ 4 ఎప్పుడు ఉంటుందో ఇప్పుడే చెప్పలేము.

జూన్ నుండి షూటింగ్

ప్రవీణ్ సత్తారు గారితో నేను చేయబోతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ఫిలిం జూన్ నుండి షూటింగ్ స్టార్ట్ అవ్వనుంది. లండన్ బేస్డ్ స్క్రిప్ అది. ఎక్కువ శాతం అక్కడే షూట్ ఉంటుంది. హైదరాబాద్ లో ఓ షెడ్యుల్ ప్లాన్ ఉంది. ఆ సినిమాను BVSN ప్రసాద్ గారు నాన్న కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress
    Photos and Special topics