Kamal Haasan Vikram - సెన్సార్ టాక్

Thursday,May 26,2022 - 03:53 by Z_CLU

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ట్రైలర్ ఇటివలే విడుదలై సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.

జూన్ 3న విడుదల కానున్న ఈ సినిమాలో మరో స్టార్ హీరో సూర్య పవర్ ఫుల్ గెస్ట్ రోల్ లో అలరించబోతున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది.

స్టార్ హీరో నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనుంది. ఇప్పటికే ట్రైలర్‌తో ప్రమోషన్‌ల జోరు పెంచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 400+ థియేటర్లలో ఈ చిత్రం భారీగా విడుదల కానుంది.

ఇదీలావుండగా నితిన్ తండ్రి నిర్మాత డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి, కమల్ హాసన్‌ను కలిసేందుకు చెన్నై వెళ్లారు. ఈ సందర్భంగా విక్రమ్ తెలుగు పోస్టర్‌ను కమల్ హాసన్‌కి అందించారు. తెలుగులో ప్రమోషన్ స్ట్రాటజీ గురించి చర్చించారు. కమల్ హాసన్ తో పాటు చిత్ర యూనిట్ తో తెలుగులో గ్రాండ్ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్ గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics