ఎక్స్ క్లూజీవ్ : హీరో కిరణ్ అబ్బవరం ఇంటర్వ్యూ

Wednesday,July 15,2020 - 11:17 by Z_CLU

సినిమా పరిశ్రమలో హీరోగా ఎదగడం అంటే మాటలు కాదు. ఎలాంటి సపోర్ట్ లేకుండా హీరో అవ్వడం అంటే దాని వెనుక ఎంతో కష్టం దాగుంటుంది. మెగా స్టార్ నుండి రాజ్ తరుణ్ వరకు ఎలాంటి సపోర్ట్ లేకుండా కష్టపడి హీరోలైన వారెందరో.. ఆ లిస్టులో ఇప్పుడో హీరో చేశాడు. అతని పేరు కిరణ్ అబ్బవరం. ‘రాజా వారు రాణి గారు’ సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీ అవుతున్నాడు. నేడు తన జన్మదినం సందర్భంగా కిరణ్ అబ్బవరం ‘జీ సినిమాలు’తో ముచ్చటించాడు. ఆ విశేషాలు ఈ యంగ్ హీరో మాటల్లోనే !


ఏడు షార్ట్ ఫిలిమ్స్

చిన్నప్పటి నుండే సినిమాల మీద ఆసక్తి ఎక్కువ. కాలేజీ చదివే రోజుల్లో సినిమా పిచ్చి ని ప్రొఫెషన్ గా మార్చుకోవాలని డిసైడ్ అయ్యాను. బిటెక్ తరువాత బెంగళూరులో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేసే వాడిని సినిమాల్లో నటించాలని ఆశక్తితో ఉండటంతో నా సీనియర్ చేసిన గచ్చిబౌలి షాట్ ఫిలింలో నటించాను. అలా ఇండస్ట్రీకి దగ్గరయ్యను. బెంగళూరు నుండి హైదరాబాద్ వచ్చి కొన్ని షార్ట్ ఫిలింస్ లో నటించాను. హీరోగా ఏడు షార్ట్ ఫిలిమ్స్ చేశాను. అందులో శ్రీకారం అనే ఓ ఇండిపెండెంట్ సినిమా కూడా ఉంది.

ఆ రెండు గుర్తింపు నిచ్చాయి

నేను చేసిన షార్ట్ ఫిలిం లో ‘ఓ మనసా రా ఇలా’ నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అలాగే శ్రీకారం అనే ఇండిపెండెంట్ సినిమా నటుడిగా నాకు మంచి పేరు తెచ్చింది. ఆ రెండు చూసి నాకు సోషల్ మీడియా ద్వారా చాలా మంది మెసేజెస్ పంపారు. వాటికి మంచి కాంప్లిమెంట్స్ అందుకున్నాను. సిల్వర్ స్క్రీన్ మీద హీరోగా మారడానికి ఆ రెండు నాకు హెల్ప్ అయ్యాయి.

లైఫ్ మారిపోయింది

మొదటి సినిమా ‘రాజా వారు రాణి గారు’ సినిమాతో నా లైఫ్ మారిపోయింది. హీరోగా మొదటి సినిమాతో మంచి ప్రశంసలు అందుకోవడం ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. ఆ సినిమా చూసి చాలా మంది దర్శక నిర్మాతలు అలాగే హీరోలు ఫోన్ చేసి మాట్లాడారు. ఆ సినిమా నా కెరీర్ కి ఓ మంచి ఆరంభంగా నిలిచింది. ఇప్పటికీ OTTలో సినిమా చూసి మెసేజెస్ చేస్తుంటారు.

రెండు సినిమాలు చేస్తున్నా

‘రాజావారు రాణిగారు’ సినిమాతో వచ్చిన గుర్తింపుతో ప్రస్తుతం హీరోగా రెండు సినిమాలు చెస్తున్నాను. అందులో ఒకటి ‘SR కళ్యాణ మండపం’ కాగా మరొకటి ‘సెబాస్టియన్’. ముందుగా ‘SR కళ్యాణ మండపం’ థియేటర్స్ లోకి రానుంది.


చాలా వ్యత్యాసం ఉంటుంది.

మొదటి సినిమాకు రెండో సినిమాకు… కథ పరంగా, నా పాత్ర పరంగా చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రస్తుతం ‘ఎస్.ఆర్.కల్యాణమండపం’ సినిమాకు సంబంధించి 40 శాతం షూటింగ్ పూర్తి అయ్యింది. శ్రీధర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్ జోనర్ లో ఉంటుంది.ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తుంది. సాయికుమార్ గారు ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన క్యారెక్టర్ సినిమాకు ప్లస్ అవుతుందని నమ్ముతున్నా.

ఆ సినిమాతో థ్రిల్ చేస్తా

బాలాజీ అనే నూతన దర్శకుడితో చేస్తున్న ‘సెబాస్టియన్’ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ఆ సినిమాలో ఓ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాను, ఇద్దరు హీరోయిన్స్ నటిస్తోన్న ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందించబోతున్నారు. ఆ సినిమాతో ప్రేక్షకులను థ్రిల్ చేస్తా. ఆ సినిమాకి మంచి ప్రసంశలు వస్తాయని భావిస్తున్నా.

వారిద్దరికీ స్పెషల్ థాంక్స్

జులై 15న నా పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ పూరి జగన్నాధ్ గారు ‘ఎస్.ఆర్.కల్యాణమండపం’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చెయ్యడం, అలాగే ‘సెబాస్టియన్’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను డైరెక్టర్ హరీష్ శంకర్ గారు రిలీజ్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. హీరోగా నన్ను ఎంకరేజ్ చేస్తూ నా సినిమా పోస్టర్స్ రిలీజ్ చేసి సపోర్ట్ అందించినందుకు వారిద్దరికీ స్పెషల్ థాంక్స్ చెప్పుకుంటున్నాను.

మరో రెండు సినిమాలు

చేస్తున్న ఈ రెండు సినిమాలు కాకుండా మరో రెండు ప్రాజెక్ట్స్ సైన్ చేసాను. అవి కూడా మంచి ఆసక్తికరమైన కథలతో తెరకెక్కనున్నాయి. వాటి డీటెయిల్స్ త్వరలోనే తెలియజేస్తాము.