హాట్ బ్యూటీ.. రీఎంట్రీకి రెడీ

Wednesday,July 15,2020 - 11:31 by Z_CLU

ఎమీ జాక్సన్.. ఈ ముద్దుగుమ్మ పేరు చెప్పగానే ఎవడు, 2.O, ఐ సినిమాలు గుర్తొస్తాయి. సౌత్ లో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ రీఎంట్రీకి రెడీ అవుతోంది. మంచి క్యారెక్టర్స్ దొరికితే సైన్ చేయడానికి సిద్ధంగా ఉంది.

నిజానికి ఈపాటికే ఎమీ తన రీఎంట్రీ మూవీని ప్రకటించాల్సింది. కానీ కరోనా కారణంగా కెరీర్ కు ఇంకొన్నాళ్లు గ్యాప్ ఇచ్చింది. మరో 3 నెలల్లో తన రీఎంట్రీ ప్రాజెక్టును ఎనౌన్స్ చేయబోతోంది.

బాబు పుట్టడంతో దాదాపు రెండేళ్లు గ్యాప్ ఇచ్చింది ఎమీ. ప్రస్తుతం తన పార్టనర్ జార్జ్ తో కలిసి లండన్ లో ఉంటున్న ఈ బ్యూటీ.. తన లేటెస్ట్ ఫొటోస్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ డేట్ చేస్తోంది.

ప్రస్తుతం ఆమె రీఎంట్రీకి రెడీ. మంచి ప్రాజెక్ట్ సెట్ అవ్వగానే ఇండియాలో ల్యాండ్ అవుతుంది.