Hero Kartikeya బెదురులంక 2012 ఫస్ట్ లుక్

Wednesday,November 30,2022 - 12:17 by Z_CLU

కార్తికేయ గుమ్మకొండ (Karthikeya Gummakonda) కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘బెదురులంక 2012’. ఇందులో ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయిక గా నటిస్తుంది. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు.

తాజాగా ‘బెదురులంక 2012’ (Bedurulanka Movie) ఫస్ట్ లుక్ తో మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ సోషల్ మీడియా లో మూవీ లవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై మంచి ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఒక పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో తెరకెక్కిన ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్‌టైనర్ గా ఉండబోతుంది.

ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. యానాం, కాకినాడ, గోదావరి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఇందులో ఓ పాటను స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాశారు. వచ్చే ఏడాది సినిమా రిలీజ్ కానుంది.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics