ATM Trailer ఇంట్రెస్టింగ్ & ఎంగేజింగ్
Wednesday,January 11,2023 - 07:02 by Z_CLU
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు ATM Web series తో ఓటీటీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. హరీష్ శంకర్ రాసిన కథతో సన్నీ హీరోగా చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ కి సంబంధించి ట్రైలర్ రిలీజైంది.

నిమిషంన్నర నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్ సిరీస్ పై ఆసక్తి కలిగిస్తూ ఇంట్రెస్టింగ్ గా సాగింది. ముఖ్యంగా సిరీస్ లో కేరెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి ? కథేంటి అనేవి ఆసక్తిగా ఉన్నాయి. పాతిక కోట్ల దొంగతనం అనే పాయింట్ చుట్టూ అల్లిన కథతో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేక్షకులకు మంచి థ్రిల్ కలిగించడం ఖాయమనిపిస్తుంది. తెలుగులో ఈ తరహా సిరీస్ లు అరుదుగా వచ్చాయి. ట్రైలర్ చూస్తే ATM ఓటీటీ ఆడియన్స్ కి మంచి ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం పక్కా అనిపిస్తుంది. అలాగే పొలిటికల్ డ్రామాతో వచ్చే సీన్స్ కూడా సిరీస్ లో హైలైట్ గా నిలిస్తాయని అర్థమవుతుంది. ముఖ్యంగా సన్నీ , సుబ్బరాజు కేరెక్టర్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయనిపిస్తుంది.
ముఖ్యంగా విజువల్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ లో బాగా ఎలివేట్ అయ్యాయి. దోపిడీ నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ ఇది.
ATM జనవరి 20 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది .
- Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics