Harish Shankar’s ATM Web series trailer released

Wednesday,January 11,2023 - 07:02 by Z_CLU

టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్, స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు ATM Web series తో ఓటీటీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. హ‌రీష్ శంక‌ర్ రాసిన క‌థ‌తో స‌న్నీ హీరోగా చంద్ర‌మోహ‌న్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ కి సంబంధించి ట్రైలర్ రిలీజైంది.

నిమిషంన్నర నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్ సిరీస్ పై ఆసక్తి కలిగిస్తూ ఇంట్రెస్టింగ్ గా సాగింది. ముఖ్యంగా సిరీస్ లో కేరెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి ? కథేంటి అనేవి ఆసక్తిగా ఉన్నాయి. పాతిక కోట్ల దొంగతనం అనే పాయింట్ చుట్టూ అల్లిన కథతో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేక్షకులకు మంచి థ్రిల్ కలిగించడం ఖాయమనిపిస్తుంది. తెలుగులో ఈ తరహా సిరీస్ లో అరుదుగా వచ్చాయి. ట్రైలర్ చూస్తే ATM ఓటీటీ ఆడియన్స్ కి మంచి ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం పక్కా అనిపిస్తుంది. అలాగే పొలిటికల్ డ్రామాతో వచ్చే సీన్స్ కూడా హైలైట్ గా నిలిస్తాయని అర్థమవుతుంది.

ముఖ్యంగా విజువల్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ లో బాగా ఎలివేట్ అయ్యాయి. దోపిడీ నేప‌థ్యంలో సాగే క్రైమ్ థ్రిల్ల‌ర్ ఇది. జ‌న‌వ‌రి 20 నుంచి జీ5లో ప్ర‌సార‌మ‌వుతుంది.

 
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics