బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కొత్త సినిమా ప్రారంభం

Thursday,February 22,2018 - 11:46 by Z_CLU

సాక్ష్యం సినిమాను ఓ కొలిక్కి తీసుకొచ్చిన హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా వెంటనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను ప్రారంభించాడు. ఈరోజు ఈ హీరో కొత్త సినిమా రామానాయుడు స్టుడియోస్ లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ మూవీతో శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయమౌతున్నాడు.

ఇప్పటివరకు సీనియర్ డైరక్టర్లతోనే సినిమాలు చేశాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. కెరీర్ లో ఫస్ట్ టైం దర్శకుడ్ని పరిచయం చేస్తూ సినిమా చేస్తున్నాడు. గతంలో ఈ దర్శకుడు.. దృశ్యం, గోపాల గోపాల, డిక్టేటర్ లాంటి సినిమాలకు సహాయ దర్శకుడిగా వర్క్ చేశాడు.

వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ సొంటినేని (నాని) నిర్మాతగా ఈ సినిమా రానుంది. ఈ చిత్రం కోసం కెమెరామెన్ గా ఛోటా కె.నాయుడుని, మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ను, ఆర్ట్ డైరెక్టర్ గా చిన్నాను తీసుకున్నారు. మూవీలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. వాళ్లను ఇంకా ఫైనలైజ్ చేయలేదు.