Hanu-Man: రేపే హనుమాన్ టీజర్ రిలీజ్

Monday,November 14,2022 - 12:49 by Z_CLU

Hanu-Man Movie Teaser to Release Tomorrow

టాలీవుడ్ లో హను-మాన్ హంగామా మొదలైంది. ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న చాలామందికి టీజర్ తో ట్రీట్ ఇవ్వబోతున్నాడు హను-మాన్ (Hanu-Man). తేజ సజ్జ (Teja Sajja) హీరోగా నటించిన ఈ సినిమా టీజర్ ను రేపు గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

ఈ మేరకు ఇప్పటికే కౌంట్ డౌన్ మొదలైంది. తాజాగా ప్లేస్-డేట్ కూడా ఫిక్స్ చేశారు. హను-మాన్ టీజర్ (Hanu-Man Teaser)ను రేపు ఉదయం 9 గంటలకు ఏఎంబీ మాల్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో గ్రాండ్ గా తెరకెక్కింది హను-మాన్ సినిమా. ఈ పాన్ ఇండియా సినిమాను ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించారు.

hanuman

హను-మాన్ సినిమాకు సంబంధించి ఇప్పటికే హీరో ఫస్ట్ లుక్ రిలీజైంది. తాజాగా కూడా ఓ లుక్ రిలీజ్ చేశారు. రంగుల చొక్కా, పంచె ధరించి ఒక కొండపై నిలబడి శంఖం పూరిస్తున్నట్లు కనిపించాడు తేజ సజ్జ. పొడవాటి జుట్టు, గడ్డం, కంప్లీట్ బాడీ ట్రాన్స్ ఫార్మేషన్ లో తేజ సజ్జా లుక్ అద్భుతంగా ఉంది. ఈ చిత్రంలో ప్రత్యేక శక్తులు కలిగిన సూపర్ హీరోగా కనిపించనున్నాడు తేజ.

మూవీలో తేజ సరసన అమృత అయ్యర్ (Amritha Aiyer) హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుంది. ఇతర ముఖ్య పాత్రల్లో గెటప్ శీను, వినయ్ రాయ్, సత్య కనిపించనున్నారు.

ఈ సినిమాకు ముగ్గురు మ్యూజిక్ డైరక్టర్స్ వర్క్ చేస్తున్నారు. గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్, భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

– Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics