Hamsa Nandini - కాన్సర్ బారిన పడిన హీరోయిన్

Monday,December 20,2021 - 03:46 by Z_CLU

Hamsa Nandini Opens Up About Her Cancer

ఇట్స్ టైమ్ టు పార్టీ అంటూ అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కల్యాణ్ తో కలిసి డాన్స్ చేసి అందర్నీ ఎట్రాక్ట్ చేసింది హంసా నందిని. ఇప్పుడీ హీరోయిన్ ఓ బ్యాడ్ న్యూస్ తో మనముందుకొచ్చింది. తనకు కాన్సర్ సోకిన విషయాన్ని హంసానందిని బయటపెట్టింది.

హంసా నందినికి బ్రెస్ట్ కాన్సర్ సోకింది. దీనికి సంబంధించి సర్జరీ కూడా పూర్తయింది. ప్రస్తుతం కీమో థెరపీ సెషన్స్ నడుస్తున్నాయి. ఈ సందర్భంగా జుట్టు లేకుండా ఉన్న తన లేటెస్ట్ స్టిల్ ను హంసానందిని రిలీజ్ చేసింది.

hamsa nandini cancer

ఈ కాన్సర్ నుంచి కోలుకోవడం హంసాకు పెద్ద సమస్య కాదు. కానీ ఇంతకంటే బాధాకరమైన విషయం ఏంటంటే.. ఆమెకు ఇది వంశపారంపర్యంగా వచ్చిందట. భవిష్యత్తులో మరోసారి కాన్సర్ వచ్చే ప్రమాదం 70శాతం ఉందని డాక్టర్లు చెప్పారు.

హంసానందిని మాత్రం ధైర్యంగా ఉంది. కాన్సర్ ను ధైర్యంగా, నవ్వుతూ జయిస్తానని, మరోసారి సిల్వర్ స్క్రీన్ పైకి వస్తానని చెబుతోంది ఈ బ్యూటీ. అంతేకాదు.. వ్యక్తిగత జీవితాన్ని కూడా మరోసారి సెలబ్రేట్ చేసుకోవడానికి తను సిద్ధమని ఎనౌన్స్ చేసింది.