Chiranjeevi - ఆచార్యపై మరోసారి క్లారిటీ

Monday,December 20,2021 - 03:33 by Z_CLU

Acharya Releases on February 4th.. Makers confirms again

మెగాస్టార్ చిరంజీవి, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య‌’. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలను జ‌రుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల చేస్తున్నారు.

ఇదంతా పాత విషయమే. కాకపోతే కొన్ని రోజులుగా ఈ సినిమా వాయిదా పడుతున్నట్టు వార్తలొస్తున్నాయి. దీంతో మేకర్స్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. తప్పుడు ప్రచారాన్ని నిర్మాత‌లు ఖండించారు.

‘‘చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతోన్న ‘ఆచార్య’ సినిమా రిలీజ్ డేట్ మారుతుందని వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదు. ముందు ప్రకటించినట్లే ఫిబ్రవరి 4నే ఆచార్య చిత్రాన్నిప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున‌ విడుదల చేస్తున్నాం. ఇప్పటికే డబ్బింగ్ వర్క్ కూడా పూర్తయ్యింది. అంద‌రి అంచ‌నాల‌కు త‌గిన‌ట్లే ఆచార్య సినిమా ఉంటుంది’’

ఇలా సినిమా విడుదల తేదీపై నిరంజన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా న‌టించిన ఈ చిత్రానికి మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు.