తప్పనిసరి పరిస్థితుల మధ్య సైరాతో పోటీ

Monday,September 30,2019 - 12:10 by Z_CLU

చిరంజీవి కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ. బడ్జెట్ సంగతి పక్కనపెడితే అది మెగాస్టార్ సినిమా. అలాంటి సినిమాకు పోటీగా రావాలని ఎవరూ అనుకోరు. కానీ గోపీచంద్ మాత్రం సైరాకు పోటీగా తన సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. సైరా వచ్చిన 3 రోజులకే చాణక్య కూడా థియేటర్లలోకి వస్తోంది. అయితే ఇది ఎంత మాత్రం పోటీ కాదంటున్నాడు గోపీచంద్. తప్పనిసరి పరిస్థితుల మధ్య సైరా వచ్చిన 3 రోజులుకే రావాల్సి వస్తోందంటున్నాడు

“చిన్నప్పట్నుంచి చిరంజీవి సినిమాలు చూసి పెరిగాం. ఆయనతో పోటీ ఏంటి సిల్లీగా. తప్పనిసరి పరిస్థితుల మధ్య మాత్రమే చాణక్యను 5వ తేదీన థియేటర్లలోకి తీసుకొస్తున్నాం. మాకు మరో దారి లేదు. దసరా సీజన్ మిస్ అయితే మా సినిమాకు మరో మంచి సీజన్ కనిపించడం లేదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో వస్తున్నాం. సైరాతో పాటు మా సినిమాను కూడా హిట్ చేయాలని కోరుకుంటున్నాను.”

ఇది గోపీచంద్ రియాక్షన్. సైరా మేకర్స్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేయకముందే తమ సినిమాకు డేట్ ఎనౌన్స్ చేశామని, ఆ తర్వాత సైరా వస్తుందని తెలిసినప్పటికీ మాకు వేరే దారి కనిపించలేదని అంటున్నాడు గోపీచంద్.

“నాకు చాణక్య షూటింగ్ టైమ్ లో యాక్సిడెంట్ అయింది. 3 నెలలు సినిమా ఆగిపోయింది. లేదంటే చాలా ముందుగానే థియేటర్లలోకి వచ్చేవాళ్లం. నా వల్ల నిర్మాతలకు ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది కలిగింది. ఇలాంటి టైమ్ లో సినిమాను దసరా నుంచి తప్పిస్తే, అది నిర్మాతకు మరింత భారం అవుతుంది. పైగా పండగ సీజన్ కాబట్టి సైరాతో పాటు మరో సినిమా వచ్చినా తప్పులేదన్నారు చాలామంది. అందుకే కాస్త కష్టంగా ఉన్నప్పటికీ వచ్చేస్తున్నాం.”

ఇలా చాణక్య సినిమా రిలీజ్ వెనక జరిగిన డిస్కషన్ ను బయటపెట్టాడు గోపీచంద్. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయని, ఆడియన్స్ తన నుంచి ఏం ఆశిస్తారో అవన్నీ చాణక్యలో ఉంటాయంటున్నాడు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ వైజాగ్ లో జరిగింది.