Good Luck Sakhi టీజర్ రివ్యూ

Saturday,August 15,2020 - 01:00 by Z_CLU

మహానటి ఫేం కీర్తి సురేష్ నుంచి మరో సినిమా రెడీ అవుతోంది. దీని పేరు గుడ్ లక్ సఖి. క్రియేటివ్ డైరక్టర్ నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి ఈరోజు టీజర్ రిలీజ్ చేశారు.

టీజర్ లో అల్లరి పిల్లగా, పల్లెటూరి అమ్మాయిగా సఖి పాత్రలో కనిపిస్తోంది కీర్తిసురేష్. అదే ఊరిలో నాటకాలు వేసుకునే రామారావు పాత్రలో ఆది పినిశెట్టి, కోచ్ పాత్రలో జగపతి బాబు కనిపిస్తున్నారు.

ఊరిలో అందరితో బ్యాడ్ లక్ సఖి అనిపించుకున్న Keerthy Suresh రైఫిల్ షూటింగ్ లో ఎలా రాణించింది.. తన ఊరికి దేశానికి ఎలా పేరుతెచ్చిపెట్టిందనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రానికి రాక్‌స్టార్‌ దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. దిల్‌రాజు సమర్పణలో వర్త్‌ షాట్‌ మోషన్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్‌ లో తెరకెక్కుతున్న Good Luck Sakhi చిత్రానికి సుధీర్‌ చంద్ర పాదిరి, శ్రావ్య వర్మ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.