

Monday,June 07,2021 - 03:29 by Z_CLU
నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ టైటిల్ పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ `గుడ్ లక్ సఖి` ఆది పినిశెట్టి మేల్ లీడ్ పోషిస్తున్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.
నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న `గుడ్ లక్ సఖి` సినిమాని తెలుగు, తమిళ మరియు మలయాళ భాషలలో ఏకకాలంలో రూపొందిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర పదిరి, శ్రావ్య వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్ 3న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. అయితే కోవిడ్ -19 సెకండ్ వేవ్ కారణంగా అన్ని సినిమాల మాదిరిగానే ‘గుడ్ లక్ సఖి’ చిత్రాన్ని కూడా వాయిదా వేయాల్సి వచ్చింది.
అయితే గత కొన్ని రోజులుగా ‘గుడ్ లక్ సఖి’ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారంటూ రూమర్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ పుకార్లపై స్పందించారు మేకర్స్.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ – “’గుడ్ లక్ సఖి’ సినిమా ఓటీటీలో విడుదల కానుందని మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం.. దయచేసి పుకార్లను స్ప్రెడ్ చేయకండి. ఏదైనా న్యూ అప్డేట్ ఉంటే స్వయంగా మేమే వెల్లడిస్తాం. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉంటారని ఆశిస్తున్నాం“ అన్నారు.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా చిరంతాన్ దాస్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్ కి విశేషమైన ఆదరణ లభిస్తోంది.
నటీనటులు: కీర్తిసురేష్, ఆది పినిశెట్టి, జగపతిబాబు తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: నగేష్ కుకునూర్
సమర్పణ: దిల్ రాజు (శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్)
బ్యానర్: వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్
నిర్మాతలు: సుధీర్ చంద్ర పదిరి, శ్రావ్య వర్మ
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫి: చిరంతాన్ దాస్
Thursday,August 24,2023 07:36 by Z_CLU
Tuesday,August 22,2023 12:43 by Z_CLU
Friday,August 18,2023 03:55 by Z_CLU
Friday,August 18,2023 10:06 by Z_CLU