మరికొన్ని గంటల్లో 2.0 హంగామా

Friday,August 25,2017 - 10:06 by Z_CLU

రజనీకాంత్-శంకర్ కాంబినేషన్ లో వస్తున్న 2.0 సినిమాకు సంబంధించి మరికొన్ని గంటల్లో హంగామా షురూ కానుంది. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా నుంచి కొన్ని క్లిప్పింగ్స్ ను విడుదల చేయబోతున్నట్టు దర్శకుడు శంకర్ ప్రకటించాడు. సరిగ్గా సాయంత్రం 6 గంటలకు “గ్లింప్స్ ఆఫ్ 2.0” వస్తుందని ఎనౌన్స్ చేశాడు శంకర్.

భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది 2.0. ఈ మూవీ కోసం ఇప్పటివరకు 4వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. రోబో సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. ఎమీ జాక్సన్ హీరోయిన్.

వచ్చే ఏడాది జనవరి 25న 2.0 చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. రెహ్మాన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.