జై లవకుశ... కుశ ఫస్ట్ లుక్ రిలీజ్

Friday,August 25,2017 - 12:07 by Z_CLU

జై లవకుశ సినిమాకు సంబంధించి లవకుమార్ టీజర్ విడుదల చేసిన కొన్ని గంటలకే.. మూడో క్యారెక్టర్ అయిన కుశ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. వినాయకచవితి కానుకగా కుశాల్ లుక్ ను విడుదల చేశారు. జై క్యారెక్టర్ ను నెగెటివ్ షేడ్స్ లో, లవకుమార్ పాత్రను మంచోడిగా ప్రజెంట్ చేసిన దర్శకుడు బాబి.. కుశను కంప్లీట్ పార్టీ బాయ్ గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు.

లాంగ్ హెయిర్ తో ఉన్న కుశ లుక్ అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. మరీ ముఖ్యంగా ఫస్ట్ లుక్ లో కరెన్సీ నోట్ల మధ్య సీరియస్ లుక్ లో ఉన్న కుశ లుక్ చూస్తుంటే.. స్టయిలిష్ లుక్ తో పాటు ఇంకేదో ప్రత్యేకత కూడా చూపించబోతున్నారనే విషయం అర్థమౌతోంది.

ప్రస్తుతం ఈ సినిమా చివరి దశ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ఎన్టీఆర్, రాశిఖన్నా మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ పిక్చరైజ్ చేస్తున్నారు. అన్నట్టు వినాయక చవితి సందర్భంగా రాశి ఖన్నా లుక్ కూడా విడుదల చేశారు. సినిమాలో ప్రియ పాత్రలో కనిపించనుంది రాశిఖన్నా.