Khushi విజయ్ , సమంత మూవీ ఫస్ట్ లుక్

Monday,May 16,2022 - 01:41 by Z_CLU

First Look Out : Vijay Deverakonda, Samantha’s Romantic Comedy Titled “Kushi”

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సమంత విజయ్ కి జోడీగా కనిపించనుంది.  రొమాంటిక్ కామెడి గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లో జరుపుకుంటోంది.

తాజాగా ఈ సినిమాకు “ఖుషి” టైటిల్ ఖరారు చేశారు. టైటిల్ రివీల్ చేస్తూ విజయ్ దేవరకొండ, సమంత స్టిల్ తో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో ఈ జంట లవ్లీగా కనిపిస్తున్నారు. విజయ్,సమంత కెరీర్ లలో ఇదొక మెమొరబుల్ ఫిల్మ్ గా మిగులిపోతుందనే వైబ్స్ టైటిల్, ఫస్ట్ లుక్ తో ఏర్పడుతున్నాయి. ప్రేమలో గెలిస్తే ఖుషి, ఆ ప్రేమను కుటుంబంతో పంచుకుంటే మరింత ఖుషి. జీవితంలో ఈ సంతోషాన్ని మించిన సంపద లేదు అన్నట్లు “ఖుషి” టైటిల్, ఫస్ట్ లుక్ డిజైన్ క్రియేటివ్ గా ఉండి ఆకట్టుకుంటున్నాయి. క్రిస్మస్ స్పెషల్ గా ఈ ఏడాది డిసెంబర్ 23 న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో  సినిమాను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ సినిమా కశ్మీర్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్, వైజాగ్, అల్లెప్పి లలో మిగతా షూటింగ్ చేయనున్నారు.

* Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics