F3 Song ప్రోమో అదిరింది

Monday,May 16,2022 - 01:28 by Z_CLU

Life Ante Itta Vundaala Song Promo from F3 out

విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనీల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న’F3′ రిలీజ్ కి రెడీ అయింది. మే 27న గ్రాండ్ గా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా నుండి లేటెస్ట్ పూజ హెగ్డే సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. సినిమాలో ఓ స్విచువేషణ్ లో “లైఫ్ అంటే ఇట్టా ఉండాలా” అంటూ ఈ సాంగ్ రానుంది. సాంగ్ లో వెంకీ , వరుణ్ లతో కలిసి హాట్ బ్యూటీ పూజ హెగ్డే స్టెప్స్ వేసింది. రేపు లిరికల్ వీడియోగా రిలీజ్ అవుతున్న ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో ముందుగానే  ప్రోమో ద్వారా చూపించారు.

“హాతు మే పైసా …మూతిమే సీసా.. పోరితో సల్సా రాతిరంతా జల్సా” అంటూ వెంకీ , వరుణ్ లు సాంగ్ హమ్ చేస్తూ పూజతో కలిసి చిందేసే బిట్ తో విడుదలైన ప్రోమో అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సాంగ్ పై అంచనాలు పెంచేసింది. F2 ఫ్రాంచైజీగా వస్తున్న ఈ సినిమాలో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే అన్ని ఎలిమెంట్స్ ప్లాన్ చేశాడు దర్శకుడు. అందులో భాగంగానే పూజ హెగ్డే తో ఓ స్పెషల్ సాంగ్ పెట్టారు.

రేపు రిలీజయ్యే ఈ సాంగ్ కి దేవి ఎనర్జిటిక్ ట్యూన్ కంపోజ్ చేశాడు.  కాసర్ల శ్యామ్ లిరిక్స్ కూడా ఆకట్టుకుంటాయని ప్రోమోలో లిరిక్స్ వింటే తెలుస్తుంది. రాహుల్ సిప్లిగంజ్ , గీతా మాధురి సింగింగ్ కూడా సాంగ్ కి ప్లస్ అవ్వనుంది. సినిమాలో ఈ సాంగ్  ఆడియన్స్ కి విజువల్ ట్రీట్ లా ఉండనుందని ప్రోమో గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా , మెహ్రీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సునీల్ , సోనాల్ చౌహాన్ ఇంపార్టెన్స్ రోల్స్ కనిపించనున్నారు.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics