మన హీరోలు – వారి హాబీలు

Tuesday,June 26,2018 - 08:07 by Z_CLU

మన ఫేవరేట్ స్టార్స్ ఏం చేసినా మనకు ఎంటర్ టైన్ మెంటే… అయితే మరి ఆ స్టార్స్ ఖాళీ టైమ్ లో ఏం చేస్తుంటారు..? సినిమాల్లో నటించడం పక్కన పెడితే, ఖాళీ టైమ్ దొరికినప్పుడు మన హీరోలు చేసే పనులేంటో ఓ లుక్కేద్దామా..?

నాగార్జున

కింగ్ నాగార్జున ఖాళీగా ఉండటం కన్నా మ్యాగ్జిమం టైమ్ తను నటిస్తున్న సినిమా, లేకపోతే నిర్మిస్తున్న సినిమా…  ఇవి రెండూ కాకపోతే చేయబోయే సినిమాల డిస్కర్షన్స్ తో బిజీబిజీగా ఉంటాడు. అయితే ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా నాగ్ కి ఏ మాత్రం టైమ్ దొరికినా పురాతన వస్తువులను సేకరించడానికి ఇష్టపడతాడు. దీంతో పాటు స్విమ్మింగ్ చేయడమంటే నాగ్ హాబీ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుందట.

NTR

యంగ్ టైగర్ NTR మామూలుగానే భోజన ప్రియుడు. ఈ విషయం చాలా సందర్భాల్లో బయటపెట్టాడు కూడా. అయితే NTR జస్ట్ అవతల వాళ్ళు వండింది తినడమే కాదు, సొంతంగా వండిన వంటకాలను కూడా అంతే ఇష్టపడతాడు. హాబీస్ ఏంటి పొరపాటున అడిగినా తడుముకోకుండా బదులు చెప్పే NTR,  బిజీ షెడ్యూల్స్ మధ్య కాస్త గ్యాప్ దొరికినా వెజ్, నాన్ వెజ్ అని తేడా లేకుండా వంటలో నైపుణ్యం ప్రదర్శించేస్తుంటాడు.

పవన్ కళ్యాణ్  

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల తరవాత అంతలా ఇన్స్ పైర్ చేసినవేమైనా ఉంటే అవి పుస్తకాలే. టైమ్  దొరికినప్పుడల్లా పుస్తకాలు చదవడానికి ఇష్టపడే పవన్ కళ్యాణ్, ఫార్మింగ్ చేయడమన్నా అంతే ఇష్టపడతాడు.

రామ్ చరణ్

ఇక చెర్రీ విషయానికి వస్తే రెగ్యులర్ వర్కవుట్స్, సినిమాల మధ్య ఏ మాత్రం టైం దొరికినా హార్స్ రైడింగ్ చేస్తాడు. ఈ హాబీ తరవాత ఇమ్మీడియట్ గా రామ్ చరణ్ ఇష్టపడేది వంటగది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వంటకాలు చేయడమంటే చాలా ఇష్టపడతాడు రామ్ చరణ్.

రానా

సినిమా సెట్స్ పై కాకుండా రానా ఎక్కడైనా ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడంటే అది జిమ్. వర్కవుట్ చేస్తూ ఎప్పటికప్పుడు మేకోవర్ చేసుకోవడానికి ఇష్టపడే రానా, తన దగ్గర ఉన్న పనికి రాని వస్తువులతో సొంతంగా ఏదైనా తయారు చేసి ఫ్రెండ్స్ కి గిఫ్ట్ చేయడం రానా హాబీ.

రవితేజ

ఇక మాస్ మహారాజ్ రవితేజ విషయానికి వస్తే సినిమాల కన్నా బెస్ట్ ఎవర్ ఎంటర్ టైన్ మెంట్ ఏదీ లేదంటాడు. ఖాళీ టైమ్ దొరికినప్పుడల్లా ఒక్క సినిమా వదలకుండా చూసేస్తుంటాడు. దాంతో పాటు కొత్తకొత్త ప్రదేశాలాకు ట్రావెల్ చేయడమంటే ఇష్టపడతాడు రవితేజ.