అఖిల్ బైక్ స్టంట్స్.. సింప్లీ సూపర్బ్

Tuesday,June 26,2018 - 06:56 by Z_CLU

రిస్కీ స్టంట్స్ ఉన్నప్పుడు డూప్ తో చేయడం వెరీ కామన్. కానీ అఖిల్ కు మాత్రం  అది నచ్చదు. ఎంత కష్టమైన స్టంట్ అయినా స్వయంగా తనే చేయాలనుకుంటాడు. ఇప్పుడు తన మూడో సినిమాకు కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు. లండన్ లో అఖిల్ మూడో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ షూటింగ్ లో ఓ లేటెస్ట్ బైక్ పై ఇలా అద్భుతంగా విన్యాసాలు చేశాడు అఖిల్.

https://www.instagram.com/p/Bke91YGhKMt/?utm_source=ig_twitter_share&igshid=1xlcms3pjwts6

మొదటి సినిమాలో రిస్కీ స్టంట్స్ చేశాడు అఖిల్. వినాయక్ వద్దంటున్నా దూసుకొస్తున్న కారుపై నుంచి జంప్ చేశాడు. రెండో సినిమా ‘హలో’లో కూడా అంతే. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ పర్యవేక్షణలో చాలా రిస్కీ ఫైట్స్ చేశాడు. ఇప్పుడు మూడో సినిమా కోసం ఇలా బైక్ తో ఫీట్స్ చేస్తున్నాడు.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతోంది అఖిల్ మూడో సినిమా. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. తమన్ సంగీతం అందిస్తున్నాడు.