F3 Movie సెన్సార్ టాక్

Friday,May 20,2022 - 03:14 by Z_CLU

F3 Censor done , here’s the Talk

విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో F2 ఫ్రాంచైజీ గా వస్తున్న F3కి సంబంధించి అన్ని కార్యక్రామాలు పూర్తయ్యాయి. తాజాగా సెన్సార్ నుండి సినిమాకు క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ దక్కింది. ఫ్యామిలీ అంతా చూసే సినిమా కావడం, పైగా వల్గారిటీ లేకపోవడంతో సెన్సార్ సభ్యులు నుండి మేకర్స్ కి అభినందనలు దక్కాయి.

సినిమాలో హిలేరియస్ ఎంటర్టైన్ మెంట్ బ్లాక్స్ చూసి సెన్సార్ సభ్యులు బాగా ఎంజాయ్ చేశారని తెలుస్తుంది. అలాగే అనిల్ మార్క్ కామెడీతో ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసేలా సినిమా ఉందని టీంతో చెప్పారని సమాచారం. భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ఈగర్ వెయిట్ చేస్తున్న ఈ సినిమాకు సాధారణ టికెట్ రేటునే ఫిక్స్ చేశారు నిర్మాత దిల్ రాజు.

వెంకటేష్ సరసన తమన్నా వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్ , సోనాల్ చౌహాన్ , రాజేంద్ర ప్రసాద్ , వెన్నెల కిషోర్ , అన్నపూర్ణమ్మ , ప్రగతి , ప్రదీప్ కీ రోల్స్ లో కనిపించనున్నారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. మే 27న సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics