ఎఫ్2 ట్రయిలర్.. నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత

Monday,January 07,2019 - 08:22 by Z_CLU

టీజర్ తో ఇప్పటికే ఓ రేంజ్ లో నవ్వులు పూయించారు వెంకీ-వరుణ్. ఇప్పుడు ట్రయిలర్ తో వాటిని రెట్టింపు చేశారు. ఎఫ్-2 ట్రయిలర్ వచ్చేసింది. వెంకీ కామెడీ టైమింగ్ ను పూర్తిస్థాయిలో ఎలివేట్ చేసింది. 2 నిమిషాల డ్యూరేషన్ ఉన్న ఈ ట్రయిలర్ మొత్తం కామెడీ పంచ్ లు, సెటైర్లే.

మేకర్స్ చెబుతున్నట్టు ఈ సంక్రాంతికి కాస్త గట్టిగా నవ్వించే సినిమా ఇదొక్కటే. ట్రయిలర్ చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమైపోతుంది. మరీ ముఖ్యంగా వెంకీ-వరుణ్ ల కాంబినేషన్ సీన్లు బ్రహ్మాండంగా పేలాయనే విషయం ట్రయిలర్ చూస్తే తెలుస్తోంది.

అనీల్ రావిపూడి డైరక్షన్ లో తెరకెక్కిన ఎఫ్-2 సినిమా సంక్రాంతి కానుకగా ఈనెల 12న థియేటర్లలోకి వస్తోంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో మెహ్రీన్, తమన్న హీరోయిన్లుగా నటించారు.