ఎక్స్ క్లూజీవ్ : రానాతో సుకుమార్ శిష్యుడు !

Saturday,March 06,2021 - 10:00 by Z_CLU

సుకుమార్ శిష్యుడిగా ‘ఉప్పెన’ సినిమాతో  బుచ్చి బాబు దర్శకుడిగా పరిచయమై ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే.  ఇప్పుడు  సుక్కు కాంపౌండ్ నుండి మరో శిష్యుడు వెంకీ డైరెక్టర్ గా మారబోతున్నాడు. వెంకీ కొన్నేళ్ళుగా సుకుమార్ దగ్గర పనిచేస్తున్నాడు. సుక్కు డైరెక్ట్ చేసిన సినిమాలకు రచయితగా కూడా వర్క్ చేశాడు.

ఎట్టకేలకు ఇప్పుడు మెగా ఫోన్ పట్టి సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే దగ్గుబాటి రానా కి కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడని సమాచారం. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బేనర్ పై రామ్ ఆచంట , గోపి ఆచంట నిర్మించబోతునున్నారని తెలుస్తుంది.

sukumar-assistant-venky-rao-

సుక్కు శిష్యుడు బుచ్చి బాబు ఓ ఎమోషనల్ ప్రేమకథతో మొదటి సినిమా తీశాడు. మరి వెంకీ తన డెబ్యూ సినిమాకు ఎలాంటి కథ సిద్దం చేసుకున్నాడు ? రానా ని ఎలా చూపించబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది. ఇటివలే స్క్రిప్ట్ లాక్ చేసుకొని ప్రెజెంట్  ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ఎనౌన్స్ కానుంది.