Ekkadiki Pothavu Chinnavada - నాలుగేళ్ల భయం

Wednesday,November 18,2020 - 01:47 by Z_CLU

హారర్ ట్రెండ్ పీక్స్ లో నడుస్తున్న టైమ్. ప్రతి శుక్రవారం ఓ హారర్ సినిమా. కానీ క్లిక్ అయ్యేవి మాత్రం పదిలో ఒకటి మాత్రమే. అలా ఊహించని విజయాన్నందుకున్న సినిమా ఎక్కడికి పోతావ్ చిన్నవాడా.

హారర్ కు పునర్జన్మ-ఆత్మ కాన్సెప్ట్ యాడ్ చేసి తీసిన ఈ సినిమా రిలీజైన మొదటి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. నిఖిల్, హెబ్బా పటేల్, నందిత శ్వేత, అవికా గౌర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా రిలీజై, ఇవాళ్టికి (నవంబర్ 18) సరిగ్గా నాలుగేళ్లు అవుతోంది.

Full Movie – ఎక్కడికి పోతావ్ చిన్నవాడా

వీఐ ఆనంద్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో పాయింట్ ను అప్పటివరకు ఎవ్వరూ టచ్ చేయలేదు. అందుకే ప్రేక్షకులు చాలా కొత్తగా ఫీలయ్యారు. దీనికితోడు నిఖిల్, నందిత శ్వేత యాక్టింగ్ ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచింది.

శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ఎక్స్ ట్రా లుక్ తీసుకొచ్చాయి. దీనితోడు వెన్నెల కిషోర్, సత్య కామెడీ మరో ప్లస్. ఇలా అన్ని కలిసి రావడంతో
Ekkadiki Pothavu Chinnavada సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది.

నిఖిల్ కెరీర్ లో మెమొరబుల్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా.