ఈ హీరో అస్సలు తగ్గట్లేదుగా

Saturday,February 15,2020 - 10:15 by Z_CLU

అశ్వథ్థామ సక్సెస్ నాగశౌర్యలో కొత్త ఉత్సాహం తీసుకొచ్చినట్టుంది. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. ఇప్పటికే చేతిలో 2 సినిమాలున్నాయి. ఇప్పుడు మరో సినిమా కూడా ప్రకటించాడు.

118 సినిమాతో హిట్ సాధించి ప్ర‌స్తుతం కీర్తిసురేశ్‌తో `మిస్ ఇండియా` చిత్రాన్ని నిర్మిస్తోన్న నిర్మాణ సంస్థ ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్. ఈ బ్యాన‌ర్‌పై నాగ‌శౌర్య హీరోగా కొత్త సినిమా రానుంది. ఈ విషయాన్ని నిర్మాత మహేష్ కోనేరు అఫీషియల్ గా ఎనౌన్స్ చేశాడు.

ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన రాజా ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. వేస‌వి ప్రారంభంలో సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రంలో న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తారు.