రాజశేఖర్ సినిమా ఈసారైనా వస్తుందా?

Saturday,February 15,2020 - 10:21 by Z_CLU

అర్జున.. రాజశేఖర్ హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పటిది కాదు. చాన్నాళ్ల కిందటే షూటింగ్ పూర్తిచేసుకొని, ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది. కానీ ఎప్పటికప్పుడు రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. తాజాగా మరోసారి ఈ సినిమా లైమ్ లైట్లోకి వచ్చింది. ఈ సినిమా రిలీజ్ పక్కా అంటున్నారు మేకర్స్.

డాక్టర్ రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం అర్జున. మరియం జకారియా హీరోయిన్. కన్మణి దర్శకత్వం వహించారు. నట్టిస్ ఎంటర్ టైన్మెంట్స్, క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై నట్టి కరుణ, నట్టి క్రాంతి అందిస్తున్న ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.

అర్జున సినిమాలో తండ్రీ కొడుకులుగా రాజశేఖర్ డ్యూయల్ రోల్ పోషించాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్ ఓ పాత్రలో రైతుగా కనిపించబోతున్నాడు. కాస్త వయసు మళ్ళిన సూర్యనారాయణ అనే రైతు పాత్రలోనూ…  అలాగే ఆయన తనయుడిగా అర్జున పాత్రలోనూ రాజశేఖర్ కనిపిస్తాడు. ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.