అఫీషియల్: స్వప్న సినిమాస్ లో దుల్కర్ మూవీ!

Tuesday,July 28,2020 - 02:40 by Z_CLU

మళయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో మరో సినిమా చేయబోతున్నాడు. ‘మహానటి’ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్ ఇప్పుడు సోలో హీరోగా తెలుగు సినిమా చేయబోతున్నాడు. స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి డైరెక్షన్ లో దుల్కర్ సినిమా తెరకెక్కనుంది. ఈ విషయాన్ని తాజాగా ప్రకటించారు మేకర్స్. సినిమాలో లెఫ్టినెంట్ రామ్ గా కనిపించబోతున్నాడు.

ఆర్మీ నేపథ్యంలో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాకు విశాల్ చంద్ర శేఖర్ మ్యూజిక్ అందించనున్నారు. పోస్టర్ లో దర్శకుడు హను ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’అని చెప్పడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

తెలుగుతో పాటు మళయాళం, తమిళ్ లో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. వైజయంతి మూవీస్ సమర్పణలో ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది.