శర్వా డైరెక్టర్ తో దుల్కర్ తెలుగు సినిమా !

Wednesday,March 18,2020 - 01:32 by Z_CLU

మళయాళం, తమిళ్ సినిమాలతో బిజీ స్టార్ అనిపించుకుంటున్న దుల్కర్ సల్మాన్ తెలుగులో స్ట్రయిట్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన దుల్కర్ త్వరలోనే మరో స్ట్రయిట్ తెలుగు మూవీతో ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడు.

ఇటీవలే హను రాఘవపూడి డైరెక్షన్ లో తెలుగు సినిమా కన్ఫర్మ్ చేసుకున్నాడు దుల్కర్. శర్వానంద్ హీరోగా ‘పడి పడి లేచె మనసు’ సినిమా తీసి నిరాశ పరిచిన హను.. కొంచెం టైం తీసుకొని దుల్కర్ కోసం ఓ లవ్ స్టోరీ రెడీ చేశాడట. స్టోరీలైన్ నచ్చడంతో దుల్కర్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

 

స్వప్న సినిమాస్ బ్యానర్ పై స్వప్నదత్, ప్రియాంక దత్ ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే దుల్కర్ నటించబోయే ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.

రీసెంట్ గా దుల్కర్ నటించిన కనులు కనులను దోచాయంటే సినిమా థియేటర్లలోకి వచ్చింది. సినిమాకు మంచి టాక్ వచ్చినప్పటికీ, కరోనా కారణంగా థియేటర్లు బంద్ అవ్వడంతో మూవీ ఆడలేదు.