DJ Tillu - సిద్దు సినిమాకు రిలీజ్ డేట్

Friday,January 28,2022 - 07:03 by Z_CLU

DJ Tillu Movie to Release on February 11

సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన ‘DJ TILLU’ సినిమాకు రిలీజ్ డేట్ లాక్ అయింది. ముందుగా సంక్రాంతి రేస్ లో నిలిచిన ఈ సినిమా అనుకోకుండా వాయిదా పడింది. ఇప్పుడు సినిమాను ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ముందుగా ఫిబ్రవరి 4న రిలీజ్ అనుకొని మళ్ళీ ఫిబ్రవరి 11 షిఫ్ట్ చేసుకున్నారు.

సిద్దు హీరోగా నటించడమే కాకుండా దర్శకుడు విమల్ తో కలిసి కథ -స్క్రీన్ ప్లే మీద వర్క్ చేశాడు. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తుండటం విశేషం. సితార ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో సిద్దు సరసన నేహ శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ప్రిన్స్ , బ్రహ్మాజీ ,ప్రగతి , నర్రా శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

తాజాగా రిలీజ్ చేసిన సాంగ్స్ తో పాటు టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చిన ఈ సినిమాకు సంబంధించి మరో రెండు రోజుల్లో టీం ప్రమోషన్ మొదలు పెట్టి రిలీజ్ డేట్ ఆడియన్స్ కి రీచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.