RRR Movie - ఎవరైనా సైడ్ ఇవ్వాల్సిందే!

Sunday,January 30,2022 - 05:05 by Z_CLU

Dil Raju about RRR Movie release Dates

RRR కి సంబంధించి రెండు డేట్స్ ఎనౌన్స్ చేశారు. అందులో ఒకటి మార్చ్ 18 కాగా మరొకటి ఏప్రిల్ 28. ఈ రెండు తేదిల్లో ఒకరోజు సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించడంతో ఇప్పుడు మార్చ్ , ఏప్రిల్ లో రిలీజ్ అంటూ ప్రకటించిన సినిమాల పరిస్థితి అయోమయంగా మారింది. ఇటివలే భీమ్లా నాయక్ కోసం ఫిబ్రవరి డేట్ ని వదులుకొని F3 ఏప్రిల్ 28 అంటూ ప్రకటించారు దిల్ రాజు.

తాజాగా అదే డేట్ కి RRR వస్తే ? అనే ప్రశ్న దిల్ రాజు కి ఎదురైంది. దీంతో వెంటనే ఆయన RRR లాంటి పాన్ ఇండియా సినిమా ఒకవేళ ఏప్రిల్ 28 కి వస్తే కనుక మా సినిమాను పోస్ట్ పోన్ చేసుకుంటామని తెలిపాడు. ఒక పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు మిగతా సినిమాలు సైడ్ ఇవ్వాల్సిందే అన్నటుగా ఆయన చెప్పారు. ఇక ఫిబ్రవరి ఎండింగ్ కల్లా పరిస్థితులు చక్కబడేలా కనిపిస్తున్నాయని , మార్చ్ నుండి పెద్ద సినిమాలన్నీ ఒక్కొక్కటిగా థియేటర్స్ లోకి వచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు.

ఇక ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ఇష్యూ పై కూడా త్వరలోనే క్లారిటీ రానుందని ప్రభుత్వం దానికోసం ఒక కమిటీ వేసిందని వారు అందరి ఒపినియన్ తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారని, త్వరలోనే ఇండస్ట్రీకి మంచి జరగనుందని ఆశా భావం వ్యక్తం చేశారు. ఇక RRR రిలీజ్ డేట్స్ ప్రకటించిన రోజు నుండి మిగతా పెద్ద సినిమాలు ఎప్పుడు రాబోతున్నయనే ఆసక్తి నెలకొంటుంది.