కొడుక్కి మహేష్ పాత్ర పేరు పెట్టుకున్న దర్శకుడు

Sunday,April 12,2020 - 12:53 by Z_CLU

సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజ్ అవుతున్న టైమ్ లోనే దర్శకుడు అనీల్ రావిపూడికి కొడుకు పుట్టాడు. అదే టైమ్ లో సినిమా కూడా సక్సెస్ అయింది. అనీల్ రావిపూడి టైప్ డైరక్టర్ అయిపోయాడు. అందుకే తన కొడుక్కి సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ పోషించిన పాత్ర పేరు పెట్టుకున్నాడు అనీల్ రావిపూడి.

సినిమాలో ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించాడు మహేష్. అందుకే తన కొడుక్కి అజయ్ తో ప్రారంభమయ్యేలా అజయ్ సూర్యాంశ్ అనే పేరు పెట్టుకున్నాడు. సరిలేరు నీకెవ్వరు సినిమాతో డైరక్టర్ గా తనకు స్టార్ డమ్ వచ్చిందని, అందుకే తన కొడుక్కి సినిమాలో మహేష్ బాబు పాత్ర పేరు పెట్టుకున్నానని అంటున్నాడు అనీల్.

ప్రస్తుతం ఈ దర్శకుడు ఎఫ్3 పనితో బిజిగా ఉన్నాడు. ఎఫ్2కు సీక్వెల్ గా రాబోతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి తన రైటర్స్ టీమ్ తో కథ సిద్ధం చేసే పనిలో పడ్డాడు.