విజువల్ ఎఫెక్ట్స్ తో దిల్ రాజు భారీ ప్లానింగ్

Tuesday,January 17,2023 - 11:54 by Z_CLU

ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ , తమిళ్ భాషల్లో భారీ సినిమాలు నిర్మిస్తూ పాన్ ఇండియా నిర్మాతగా ఎదుగుతున్న దిల్ రాజు Dil Raju ప్రస్తుతం శంకర్ , రామ్ చరణ్ కాంబోలో భారీ పాన్ ఇండియా మూవీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ స్టేజీలో ఉన్న ఈ సినిమాతో పాటు మరో మూడు భారీ బడ్జెట్ మూవీస్ లైన్లో పెట్టేశారు దిల్ రాజు.

ఇంద్రగంటి డైరెక్షన్ లో ‘జటాయు’ Jatayu అలాగే శైలేష్ కొలను డైరెక్షన్ లో ‘విశ్వంభర’ Vishwambhara , ఇక పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ‘రావణం’ Ravanam సినిమాలు ఉన్నట్టు టైటిల్స్ తో సహా తాజాగా దిల్ రాజు ప్రకటించారు. ఈ సినిమాలన్నీ విజువల్ ఎఫెక్ట్స్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నట్లు దిల్ రాజు హింట్ కూడా ఇచ్చారు. అయితే ప్రశాంత్ నీల్ తో రావణం అనే దిల్ రాజు ప్రాజెక్ట్ పై మూవీ లవర్స్ ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఈ కాంబోలో రానున్న సినిమాలో హీరో ఎవరు ? ఎలాంటి కథతో రాబోతుంది ? అనేది హాట్ టాపిక్ గా మారింది.

ఏదేమైనా త్వరలోనే ఈ సినిమాలతో దిల్ రాజు భారీ లెవెల్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారన్నమాట. మరి ఈ సినిమాలు సెట్స్ పైకి వచ్చేదెప్పుడో ? చూడాలి.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics