చిన్న సినిమాకు కొత్త ప్రమోషన్

Sunday,November 13,2016 - 01:50 by Z_CLU

హాస్యపాత్రలతో మొన్నటివరకు బిజీగా గడిపిన శ్రీనివాసరెడ్డి… జయమ్ము నిశ్చయమ్మురాా సినిమాతో మరోసారి హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. పూర్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమా పేరు జయమ్ము నిశ్చయమ్మురా. ఈ సినిమాకు డిఫరెంట్ గా ప్రమోషన్ ప్లాన్ చేశారు. ఓన్లీ డైరక్టర్లతో ప్రచారం నిర్వహిస్తున్నారు.

jayammunnishayammura

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను త్రివిక్రమ్ లాంచ్ చేశాడు. సాంగ్ టీజర్ ను సుకుమార్ రిలీజ్ చేశాడు. ఇప్పుడు థియేట్రికల్ ట్రయిలర్ లాంచ్ కోసం మరో స్టార్ డైరక్టర్ ను రంగంలోకి దించుతున్నారు. అతడు మరెవరో కాదు.. కొరటాల శివ. అవును.. జయమ్ము నిశ్చయమ్మురా థియేట్రికల్ ట్రయిలర్ ను కొరటాల లాంఛ్ చేయబోతున్నాడు. ఇక త్వరలోనే దర్శకుడు కాబోతున్న వక్కంతం వంశీ, అనిల్ రావిపూడిని కూడా రంగంలోకి దించారు. వీళ్లిద్దరితో చెరో రెండు ఫస్ట్ లుక్స్ విడుదల చేయాలనుకుంటున్నారు. ఇలా తన కొత్త సినిమా కోసం దర్శకులందర్నీ లైన్లో పెడుతున్నాడు శ్రీనివాసరెడ్డి. ఈనెల 25వ ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.